గ్లాస్ బాక్స్ తెరిచిన వ్యక్తికి షాక్.. అమాంతంగా దాడి చేసిన కొండచిలువ..

ఊహించని ప్రమాదాలు మనకు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా యాక్సిడెంట్లు, ఏదైనా క్రూర మృగాలు దాడి చేయడం ఇలాంటి అదే కోవలోకి వస్తాయి.

 Python Attacks A Man While Opening Glass Box Video Viral Details, Glass Box, Vir-TeluguStop.com

ముఖ్యంగా కొండ చిలువలు దాడి చేస్తే తప్పించుకోలేం.ఎంత పెద్ద మనిషిని అయినా అమాంతంగా మింగేస్తాయి.

లోపలికి వెళ్లిన తర్వాత చెట్టుకు చుట్టుకుని జీర్ణం చేసుకుంటాయి.ఇవి దాడి చేస్తే జంతువులు కూడా తట్టుకోలేవు.

మనుషులు అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఒంటరి మనిషి అయితే ఇక చనిపోవడం ఖాయం.

ఇదే తరహాలో ఓ వ్యక్తి కొండచిలువ బారిన పడ్డాడు.అది అతడి చేతిని గట్టిగా పట్టుకోవడంతో విలవిల్లాడిపోయాడు.

అంతేకాకుండా కొండచిలువ అతడిని మింగేయాలని ప్రయత్నించింది.చివరికి కొండచిలువ బారి నుంచి అతడు బయటపడ్డాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

అది కొండ చిలువకు సంబంధించినది.చాలా మంది విదేశాల్లో కొండ చిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు.

అయితే అవి ఒక్కోసారి ప్రమాదాలకు గురి చేస్తాయి.ఇదే తరహాలో ఓ ఇంట్లో కొండచిలువను పెంచుకుంటుంటారు.

గ్లాస్ బాక్స్‌లో కొండ చిలువను బంధించి ఉంచుతారు.ఆ గ్లాస్ బాక్స్‌ను ఓ వ్యక్తి అనుకోకుండా తెరుస్తాడు.

తెరిచిన వెంటనే అతడిపై కొండచిలువ దాడి చేస్తుంది.చేతిని బలంగా కరిచేస్తుంది.అది తట్టుకోలేక అతడు భయపడి బాధతో గట్టిగా కేకలు వేస్తాడు.ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ మహిళ చూస్తుంది.ఆమె తన బిడ్డను ఆడిస్తుంది.భయంతో లోపలికి పారిపోతుంది.

అయితే ఆ వ్యక్తికి సాయపడేందుకు ఓ ముగ్గురు వస్తారు.కొండ చిలువ బారి నుంచి అతి కష్టం మీద అతడిని కాపాడతారు.

చివరికి భయంతో వణికిపోతున్న ఆ వ్యక్తి కొండచిలువ ముప్పు తప్పడంతో ఊపిరి పీల్చుకుంటాడు.దీనికి సంబంధించిన వీడియోను laris_a9393 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube