తన భార్యతో బ్యూటిఫుల్ మూమెంట్ షేర్ చేసిన ఎన్టీఆర్.. పిక్ వైరల్!

ప్రెజెంట్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది.

 Jr Ntr Shares A Lovey Dovey Picture With Wife Lakshmi Pranathi, Ntr, Lakshmi Pra-TeluguStop.com

ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు.ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు.

ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని నందమురి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ సినిమా ప్రకటించి ఏళ్ళు గడుస్తున్న ఇంకా కొన్ని కొన్ని కారణాల వల్ల సెట్స్ మీదకు వెళ్లడం లేదు.

ఇక ప్రెజెంట్ కొరటాల తన టీమ్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూ బిజీగా ఉండగా.ఎన్టీఆర్ ఈ సినిమా కంటే ముందు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు.

తన భార్య, పిల్లలతో కలిసి రీసెంట్ గా వెకేషన్ కు వెళ్లి అక్కడ కుటుంబంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాడు తారక్.

ఇక తాజాగా తారక్ తన వెకేషన్ నుండి ఒక బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేసాడు.

ఈ పిక్ ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో తారక్ తో కలిసి తన భార్య లక్ష్మి ప్రణతి ఉంది.

భార్యతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తనపై ఎంత ప్రేమ ఉందో ఆ ఫోటో రూపంలో చెప్పకనే చెప్పాడు.తారక్ ఆమె నుదిటిపై ముద్దు పెడుతూ హగ్ చేసుకున్నాడు.

లక్ష్మి ప్రణతి కూడా తారక్ ప్రేమను ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తుంది.ఇక ఎన్టీఆర్ ఈ ఫోటో షేర్ చేస్తూ లవ్ సింబల్స్ కూడా పెట్టడంతో ఈయనకు భార్య అంటే ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతుంది.ఈ బ్యూటిఫుల్ పిక్ మూమెంట్ నెట్టింట వైరల్ అయ్యింది.మరి తారక్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత కొరటాల సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది.

చూడాలి ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ముగిస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube