24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డ్ ఖాతాలో వేసుకున్న పుష్పరాజ్ !

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ ఏవైటెడ్ చిత్రాల్లో పుష్ప ఒకటి.

ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి.అంతేకాదు అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ నుండి భారీ హైప్ తో ఫస్ట్ సింగిల్ గా సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

Advertisement

ఈ సాంగ్ మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయడంతో అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ముఖ్యంగా మన తెలుగులో రికార్డ్ నెలకొల్పడానే చెప్పాలి.సౌత్ ఇండియా లో ఆల్ టైమ్ రికార్డ్ 9.4 మిలియన్ వ్యూస్ మరియు 6 లక్షల 57 లైక్స్ తో భారీ రికార్డ్ నమోదు చేసుకుంది.ఇదంతా విడుదల అయినా 24 గంటల్లోనే జరగడంతో బన్నీ ఫాలోయింగ్ మరొకసారి నిరూపితమైంది.

ఫస్ట్ సింగిల్ టోన్ రికార్డ్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఈ సినిమా మిగతా అప్డేట్ తో మరిన్ని రికార్డ్స్ సృష్టించిన ఆశ్చర్య పోయే పని లేదు.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరొక ప్లస్ అనే చెప్పాలి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు