రీల్స్ చేసుకోమంటున్న పుష్ప.. ఎగబడుతున్న జనం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ మేనియా ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఊపేస్తోంది.ఈ సినిమాలోని ‘దాక్కొ దాక్కొ మేక’ అనే పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

 Pushpa Team Offers To Do Insta Reels, Pushpa, Allu Arjun, Insta Reels, Sukumar,-TeluguStop.com

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో బన్నీ కాంబినేషన్ ఎందుకంత స్పెషల్‌గా ఉంటుందో ఈ సినిమా క్రేజ్ చూస్తే మరోసారి అర్థమవుతుంది.వీరిద్దరి మధ్య ఉండే బాండింగ్‌కు ఎలాంటి కథనైనా దాసోహం అని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవాల్సిందే.

ఇక పుష్పకు వస్తున్న క్రేజ్‌ను చిత్ర యూనిట్ ఏమాత్రం తక్కువ కాకుండా దాన్ని మరింత పెంచుతూ వెళ్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్‌గా రాణిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పుష్ప సినిమా పాటకు అభిమానులు రీల్స్ చేయొచ్చంటూ ప్రకటించింది.

టిక్‌టాక్ తరువాత అంత ఫేమస్ అయిన ఈ రీల్స్‌లో పుష్ప రీల్స్ ఉంటే దాని రేంజ్ మరింత మందికి చేరుతుందని పుష్ప చిత్ర యూనిట్ ఆలోచన.అందుకే వారు ఈమేరకు అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

పుష్ప సాంగ్‌లో వచ్చే థీమ్‌కు రీల్స్ చేసి వదలండి అని వారు పేర్కొన్నారు.ఇక దీంతో బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రీల్స్ వాడే సాధారణ పబ్లిక్ కూడా ఈ సాంగ్ రీల్స్ చేస్తారని సదరు చిత్ర యూనిట్ ఆశిస్తుంది.

మరి పుష్ప చిత్ర మార్కెటింగ్ లెవెల్‌కు ఈ రీల్స్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.కాగా పుష్ప చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే పాత్రలో ఊరమాస్ అవతారంలో రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వనుండా, ఆయనకు సరిసమానంగా విలన్ పాత్రలో మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ నటిస్తున్నాడు.

అందాల భామ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు గూస్‌బంప్స్ తెప్పించే మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube