మార్కెట్ లో శ్రీవల్లి సారీస్.. అక్కడ ఫుల్ డిమాండ్..!

సుకుమార్ డైరక్షన్ లో తెరకెక్కిన పుష్ప క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా బాక్సాఫీస్ ని షేక్ చేశాడు.

పుష్ప సినిమాలో సాంగ్స్, స్టెప్స్, డైలాగ్స్ ఇవన్ని ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి.ఇక ఇప్పుడు పుష్ప కాస్టూంస్ కూడా క్రేజీగా మారాయి.

పుష్ప సినిమాలో రష్మిక మందన్న కట్టుకున్న సారీ డిజైన్స్ ఇప్పుడు పాపులర్ అయ్యాయి.పుష్ప సినిమాలో సామీ సామీ సాంగ్ లో శ్రీవల్లి అదే రష్మిక మందన్న కట్టిన రెడ్ కలర్ సారీ.

గ్రీన్ కలర్ బ్లౌజ్ కాస్టూం రాజస్థాన్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.సినిమాలో కాస్టూం డిజైనర్ ప్రీతిషీల్ సింగ్ డిసౌజా ప్రత్యేకంగా ఈ సారె డిజైన్ చేశారు.

Advertisement

ఇక ఇప్పుడు రాజస్థాన్ లో అవి శ్రీవల్లి సారీస్ అని అమ్మేస్తున్నారు.అక్కడ జనాలు కూడా ఈ సారీలకి ఎట్రాక్ట్ అవుతున్నారని తెలుస్తుంది.

శ్రీవల్లి సారీస్ అంటూ పుష్ప క్రేజ్ ని ఇంకా కొనసాగిస్తున్నారు నార్త్ ఆడియన్స్.ఓ విధంగా పుష్ప 2 కి ఇది మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది.2023 చివర్లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు