టాలీవుడ్ లో స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ని ప్రత్యేకమైన శైలి.సొసైటీలోని విషయాల మీద షూటింగ్ గా ఫోకస్ పెట్టి తాను చెప్పాలని అనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సినిమాలలో చూపిస్తూ ఉంటాడు.
అతని సినిమాలో కథలు, డైలాగ్స్ అన్ని కూడా లాగి పెట్టి కొట్టి చెప్పినట్లు ఉంటాయి.ఈ ప్రపంచంలో మర్యాదగా చెబితే ఎవడు వినడు, లాగి పెట్టి కొట్టి చెబితే బుద్ధిగా వింటాడు అనే ఫిలాసఫీని పూరీ బలంగా నమ్ముతాడు.
దానికి తగ్గట్లే అతని సినిమాలు కథలు కూడా ఉంటాయి.సినిమాలతో పాటు పూరీ కుటుంబానికి రాజకీయాలలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.
ప్రస్తుతం పూరీ తమ్ముడు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు.ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ మీద అతనికి మంచి అభిమానం ఉంది.
అవకాశం దొరికిన ప్రతిసారి పూరీ, వై ఎస్ జగన్ మీద తనకున్న అభిమానం చూపిస్తూ ఉంటాడు.అతని గొప్పతనం గురించి పొగిడేస్తూ ఉంటాడు.తాజాగా వైజాగ్ లో గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టి భారీగా ప్రాణనష్టం జరగకుండా నియంత్రించారు.దీనిపై పూరీ ట్విట్టర్ లో జగన్ ని ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టాడు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లి తక్షిణ సాయం అందించి, వాళ్లకు నేనున్నాను అనే భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ అంటూ ట్వీట్ చేసాడు పూరీ జగన్నాథ్.కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోడానికి ఎప్పుడూ ముందుండే మీ మనసుకు సెల్యూట్ అని ట్వీట్ చేసాడు పూరీ.
వైజాగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ ముగించాడు ఈ దర్శకుడు.ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.