ఏపీలో మద్యం విధానంపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన పురంధేశ్వరి..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానంపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.

మద్యంపై వస్తున్న ఆదాయంలో సీఎం జగన్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతుందని ప్రజల ప్రాణాలతో చెలగాడటం ఆడుతుందని అనేక ఆరోపణలు చేసి కొన్ని మద్యం బాటిల్స్ కూడా పగలగొట్టడం  జరిగింది.

ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు.ఆమె హెచ్చరించినట్లుగానే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

నేడు ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి అమిత్ షాతో భేటీ కావడం జరిగింది.ఈ భేటీలో ఏపీలో మద్యం విధానంలో కుంభకోణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

ఏపీలో మద్యం విధానం, కొనుగోలు అమ్మకాలపై విచారణ జరిపించాలని కోరారు.నాలుగున్నర ఏళ్లుగా మద్యం పేరిట ఏపీలో జరుగుతున్న అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై పొత్తులపై కూడా చర్చించినట్లు సమాచారం.

Advertisement

ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.ఆదివారం మాత్రమే కాదు సోమవారం కూడా పురంధేశ్వరి.

ఢిల్లీలోనే ఉండి పొత్తులపై స్పష్టత తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు