సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో చెప్పడం ఎవరి తరమూ కాదు.
అవును, ప్రతి రోజూ ఇక్కడ అనేక రకాల వీడియో స్టఫ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఎక్కువగా జంతువులకు సంబందించినటువంటి వీడియోలే నెటిజన్ల మనసులని దోచుకుంటున్నాయి.ముఖ్యంగా పెంపుడు కుక్కలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువ వైరల్ అవ్వడం మనం చూస్తూ వున్నాం.
అలాగే అప్పుడప్పుడు వీధి కుక్కలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా తెగ హల్ చల్ చేస్తూ ఉంటాయి.ఇకపోతే పెంపుడు కుక్కలు అనేవి ఎప్పుడు చూసినా చాలా నీట్ గా కనిపిస్తాయి.
ఎందుకంటే వాటికి కేర్ టేకర్స్ వుంటారు కనుక.అదే వీధి కుక్కలను ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు మనకు కనబడవు.
అయితే పెంపుడు కుక్కలకి, వీధి కుక్కలకు ఎంత వ్యత్యాసం ఉంటుంది అంటే.ఒక సిటీలో పెరిగిన చిన్న పిల్లలకి, పల్లెటూళ్లలో పెరిగిన చిన్న పిల్లలకి ఉన్నంత తేడా ఉంటుంది.
ఇలాంటి పోలిక ఇక్కడ ఎందుకంటే సిటీలో పెరిగిన పిల్లలు చాలా సెన్సిబుల్ గా వుంటారు.అంటే వీరికి ఇమ్యూనిటీ కాస్త తక్కువగానే ఉంటుంది.
అదే పల్లెటూళ్లలో పెరిగినవారికి ఇమ్యూనిటీ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇపుడు దానిని నిజం చేస్తూ ఓ వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.‘ViralHog’ అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన ఒక వీడియోని ఒకసారి గమనిస్తే ఈ వీడియోలో బురదలో పడి స్నానం చేస్తున్న ఒక కుక్కను మనం ఇక్కడ చూడవచ్చు.అందులోనే దానికి సంతోషం అని చెప్పకనే చెబుతుంది.
శరీరం నిండా బురదను పులుముకుని మరీ స్నానం చేయడం ఇక్కడ చూడవచ్చు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ముచ్చట పడుతున్నారు.
ఎక్కువమంది అది చాలా సంతోషంగా ఉందని, అలాగే బురద ఒంటికి పూసుకోవడం వలన కూడా కొన్ని రకాల వ్యాధులు నయం అవుతాయని దానికి తెలిసినట్టుగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy