కెనడా గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ అనుచరులే టార్గెట్.. పంజాబ్‌లో 1490 ప్రాంతాల్లో పోలీసుల సోదాలు

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, కెనడాకు చెందిన ఉగ్రవాది గోల్డీ బ్రార్‌లతో సంబంధం వున్న వ్యక్తుల స్థావరాలపై పంజాబ్ పోలీసులు విరుచుకుపడ్డారు.శుక్రవారం ప్రత్యేక కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

 Punjab Police Conduct Raids Across 1490 Places Connected With Aides Of Goldy Bra-TeluguStop.com

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1490 ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.భారత్ సహా విదేశాలలో వున్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల మధ్య సంబంధాలకు అంతరాయం కలిగించడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ అన్నారు.2000 మంది పోలీస్ సిబ్బంది 200 బృందాలుగా విడిపోయి ఈ భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు డీజీపీ తెలిపారు.

దీనిపై అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) అర్పిత్ శుక్లా మాట్లాడుతూ.

ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.వీరిలో కొందరికి నేరచరిత్ర వుందని, అలాగే కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ డేటాను కూడా సేకరించినట్లు చెప్పారు.

వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతామని శుక్లా వెల్లడించారు.ఈ దాడుల సందర్భంగా ఆయుధాల లైసెన్స్‌లను కూడా తనిఖీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అలాగే మందుగుండు సామాగ్రిని పొందిన వివరాలు, విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలు, విదేశాల నుంచి జరిగిన బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపైనా ఆరా తీసినట్లు అర్పిత్ శుక్లా వెల్లడించారు.

Telugu Gangstertask, Arpith Shukla, Canada, Canada Gangster, Goldy Brar, Punjab,

ఇకపోతే.యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బృందం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన రాజ్‌వీర్ అలియాస్ రవి రాజ్‌గర్‌ను అరెస్ట్ చేసినట్లు డీజీపీ జనవరి 27న ట్వీట్ చేశారు.ఇతనిపై పంజాబ్‌లో హత్య, దోపిడీ, అక్రమంగా ఆయుధాలు కలిగి వుండటం సహా పది ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్లు డీజీపీ చెప్పారు.

మరోవైపు.కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించి రెండు నెలలు కావొస్తున్న

Telugu Gangstertask, Arpith Shukla, Canada, Canada Gangster, Goldy Brar, Punjab,

అతని అరెస్ట్‌కు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కానీ పంజాబ్ పోలీసుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారం లేదు.పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాకు చెందిన బ్రార్.గతేడాది మేలో పాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా వున్నాడు.

ఇతను సిద్ధూ హత్యలో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు.ఇతనిని పట్టుకునేందుకు గాను గతేడాది జూన్‌లో ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube