అతని వల్ల పునర్నవి గర్భవతి అంటూ ప్రచారం.. పునర్నవి ఏమన్నారంటే?

ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం సెలబ్రిటీల పరువుకు భంగం కలిగించే దిశగా వార్తలను ప్రచారం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న పునర్నవి ఆ షో ద్వారా ఊహించని రేంజ్ లో క్రేజ్ ను పెంచుకోగా ఆ షోలో రాహుల్ సిప్లిగంజ్ తో క్లోజ్ గా మెలిగారు.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ కలిసి కనిపించలేదనే సంగతి తెలిసిందే.యూత్ క్రష్ గా ఊహించని రేంజ్ లో పాపులారిటీని కలిగి ఉన్న పునర్నవి గురించి తాజాగా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు నిరాధారమైన కథనాలను ప్రసారం చేశాయి.

పునర్నవి గర్భవతి అని గే బెస్టీ వల్ల తనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఈ కథనాల సారాంశం.ప్రస్తుతం పునర్నవి లండన్ లో ఉండగా తాజాగా షేర్ చేసిన ఫోటోలలో ఆమె పొట్ట భాగం పెద్దదిగా ఉండటంతో ఈ తరహా వార్తలు వినిపించడం గమనార్హం.

Punarnavi Bhupalam Reaction About Pregnancy Rumours Details Here Goes Viral , L

పెళ్లి కాకుండానే పునర్నవి తల్లి అవుతోందంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు.ఈ విషయాలు పునర్నవి దృష్టికి రావడంతో ఆమె ఘాటుగా స్పందించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా సీరియస్ గా రియాక్ట్ అవడం జరిగింది.గే బెస్టీ వల్ల తాను గర్భవతిని అయ్యానని కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో ప్రచారం జరుగుతోందని పునర్నవి చెప్పుకొచ్చారు.

Advertisement
Punarnavi Bhupalam Reaction About Pregnancy Rumours Details Here Goes Viral , L

ఇది నాన్ సెన్స్ అని ఆమె కామెంట్ చేశారు.

Punarnavi Bhupalam Reaction About Pregnancy Rumours Details Here Goes Viral , L

గత నెలలో నేను అనారోగ్యం పాలయ్యానని నా ప్రాణాలకు అపాయం కలుగుతోందని వార్తలు సృష్టించారని ఇప్పుడు నేను గర్భవతి అని రాశారని ఆమె కామెంట్ చేశారు.సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని పునర్నవి కోరారు.ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆమె కోరారు.

మీరు రాసే పిచ్చి రాతల వల్ల అవతలి వాళ్ల జీవితాలపై ప్రభావం పడుతుందని గుర్తుంచుకోవాలని పునర్నవి కామెంట్ చేశారు.పునర్నవి క్లారిటీతో ఇకనైనా ఈ ప్రచారం ఆగుతుందేమో చూడాలి.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు