టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలం సినిమా తో ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన విడుదల తేదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఫిబ్రవరి 17వ తారీఖున విడుదల ఇవ్వాల్సిన శాకుంతలం సినిమా ను మరో సారి వాయిదా వేశారు.ఏప్రిల్ నెల లో సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించినట్లు తెలిస్తోంది.గ్రాఫిక్స్ ఇతర కారణాల వల్ల సినిమాతో బడ్జెట్ మరో 20 నుండి 30 కోట్ల రూపాయలు అదనంగా అయి ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కనీసం రూ.120 నుండి రూ.130 కోట్లు చేయాల్సిన అవసరం ఉంది.
ఒక లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ఈ స్థాయి లో బిజినెస్ చేస్తుందా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు.అందుకే ఆమె కు ఈ స్థాయిలో బిజినెస్ ఇష్టమే కాక పోవచ్చు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.గుణశేఖర్ యొక్క గత చిత్రం రుద్రమ దేవి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఆయన పై నమ్మకం తో కూడా నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తానికి ఈ సినిమా ను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
హిందీ తో పాటు తమిళం లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకే అక్కడ కూడా పెద్ద నిర్మాతలు సినిమా తీసుకుంటున్నారు.150 కోట్ల రూపాయల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.మరి అంత ఈ సినిమా వసూళ్లను సాధిస్తుందనేది చూడాలి.