నా కారణంగా మా ఆయన అవమానాలు పడ్డారు.. పల్సర్ బైక్ రమణ వైఫ్ ఎమోషనల్ కామెంట్స్!

పల్సర్ బైక్ ( Pulsar Bike Song ) పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయినటువంటి ఈ పాటను రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లు నటించిన ధమాకా సినిమాలో పెట్టడంతో మరింత ఫేమస్ అయ్యింది ఈ పాట మాత్రమే కాకుండా ఈ పాట పాడినటువంటి సింగర్ రమణ కూడా అంతే పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.రమణ ( Ramana ) కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు అలాగే రచయితగా కూడా పని చేశారు.

ఇలా ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమణ ఇటీవల కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.ఈయన కుందన ( Kundana )అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.జనవరి మూడవ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే తాజాగా రమణ తన భార్య కుందనతో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ ( Sridevi Drama company ) కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.ఈ ప్రోమోలో భాగంగా కుందన రమణ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా కుందన మాట్లాడుతూ తమది ప్రేమ వివాహం అని తెలిపారు గత కొద్దిరోజులుగా ప్రేమించుకున్నామని అయితే ఇంట్లో ఈ విషయం చెప్పగానే మా పెళ్ళికి ఒప్పుకోలేదని తెలిపారు.ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని తను ఆర్టిస్ట్ కావడంతో మా పెళ్ళికి అడ్డు చెప్పారని కుందన వెల్లడించారు.నా వల్ల మా కుటుంబ సభ్యులు రమణను ఎంతో అవమానించారని ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు అంటూ ఈమె ఎమోషనల్( Emotional ) అవడంతో రమణ కూడా తన మాటలకు ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు