ప్రపంచ దేశాలు భారత్( Bharat ) వైపు చూస్తున్న వేళ తాజాగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ( Israel PM Benjamin Netanyahu ) మనదేశాన్ని కొనియాడారు.చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రత్యామ్నాయంగా భావిస్తున్న ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్( India-Middle East-Europe Corridor ) వేదికగా ఆయన ఈ ప్రశంసలు కురిపించారు.
ఈ ప్రాజెక్టు మన చరిత్రలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టుగా నిలుస్తుందని, దీని వల్ల తూర్పు దేశాలు, ఇజ్రాయిల్, మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.జీ20 సమావేశాల్లో( G20 Summit ) శనివారం అమెరికా, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించిన సంగతి విదితమే.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది.ఆసియా నుంచి యూరప్ వరకు మౌళిక సదుపాయాలను విస్తరించే దిశగా ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు అడుగులు వేస్తుందని అన్నారు.ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహూ ఓ వీడియో సందేశంలో తెలిపారు.
మిడిల్ ఈస్ట్,( Middle East ) ఇజ్రాయిల్( Israel ) ముఖచిత్రాన్ని ఈ ప్రాజెక్టు పూర్తిగా మార్చివేస్తుందని కూడా అన్నారు.భారతదేశం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు అరబ్, గల్ఫ్ దేశాలను, యూరోపియన్ దేశాలతో కలుపుతుందని నెతన్యాహూ అన్నారు.
కాగా ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన యూఎస్ఏకి( USA ) నెతన్యాహూ ధన్యవాదాలు తెలిపారు.డ్రాగన్ కంట్రీ చేపట్టిని ఈ ప్రాజెక్టు చిన్న దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందనే వాదనలు లేకపోలేదు.ప్రపంచ తయారీ దిగ్గజంగా ఉన్న చైనా( China ) తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు భూ, సముద్రమార్గాల నెట్వర్క్ ద్వారా ఆగ్నేయాసియా, గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఆఫ్రికా, యూరప్ ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో జిన్ పింగ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకు వచ్చాడు.
అయితే ఈ ప్రాజెక్టు అనుకున్నంత సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఇటలీ ఇందులోనుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy