తరగతి గదిలోనే తాగేస్తూ.. ఊగేస్తున్న ప్రొఫెసర్, ఏంటి బ్రో సార్ ఇది!

విద్యాబుద్ధులు నేర్పాల్సిన వాడే దారి తప్పాడు.తరగతి గదిలోనే తప్ప తాగి చిందులేశాడు.

 Professor Drinking Alchohol Class Room In Gndu College Of Pathankot , Pathankot, Professor Drinking Alchohol, Gndu College , Pathan Kot Gndu-TeluguStop.com

అంతేనా నా సొంత డబ్బులతో నేను మద్యం తాగుతున్నా, నన్నెవరు ప్రశ్నించలేరంటూ వాగుతున్నాడు.అయితే ఈయన చేష్టలన్నీ ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట పెట్టాడు.

క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.అయితే ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, చివరకు ఏమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 Professor Drinking Alchohol Class Room In Gndu College Of Pathankot , Pathankot, Professor Drinking Alchohol, Gndu College , Pathan Kot GNDU -తరగతి గదిలోనే తాగేస్తూ.. ఊగేస్తున్న ప్రొఫెసర్, ఏంటి బ్రో సార్ ఇది-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ జీఎన్డీయూ కళాశాలలో ఈ ఘటన జరిగింది.విద్యార్థులకు బుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్… బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాడు.తరగతి గదిలోనే మద్యం తాగుతూ… చిందులేశాడు.సదరు వ్యక్తి కళాశాలలో గణిత ఆచార్యునిగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఫుల్లుగా తాగి చిందులేస్తూ కనిపిస్తున్న ఈ ప్రొఫెసర్… సొంత డబ్బులతో మద్యం తాగుతున్నానని, తనను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డు అయింది.అంతే కాకుండా ఓ సినీ గీతాన్ని ఆలపిస్తూ.

నృత్యం చేయడం కూడా కనిపించింది.ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారడంతో.

సదరు ప్రొఫెసర్ స్పిందించాడు.తాను ఆ సమయంలో మద్యం తాగలేదని.

తాగినట్లు నటించానని పేర్కొన్నాడు.అదంతా సరదాగా చేసినట్లు చెప్పుకొచ్చాడు.

మరి అతడు చెప్పే మాటల్లో నిజం ఎంత ఉందో ఎవరికీ తెలియదు.అతను నిజంగానే నటించి ఉంటే పర్లేదు కానీ.

అలా చేస్తే మాత్రం అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నెటిజెన్లు చెబుతున్నారు.మరికొందరేమో ప్రొఫెసర్ హోదాలో ఉండి… అలాంటి చెత్త వీడియోల్లో నటించడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube