రాజశేఖర్ జైలుకు వెళతారు.. జీవిత అలాంటి మనిషి.. నిర్మాతల సంచలన వ్యాఖ్యలు?

హీరో రాజశేఖర్ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ విషయంలో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదనే ప్రశ్నకు గరుడవేగ సినిమా అని సమాధానం వినిపిస్తుంది.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.

ఈ సినిమా విజయంతో రాజశేఖర్ కెరీర్ పుంజుకుంది.అయితే తాజాగా రాజశేఖర్, రాజశేఖర్ భార్య జీవిత వివాదంలో చిక్కుకున్నారు.

జ్యో స్టార్ నిర్మాణ సంస్థ నిర్మాతలు రాజశేఖర్, జీవిత తమకు రావాల్సిన 26 కోట్ల రూపాయలను చెల్లించలేదని కామెంట్లు చేశారు. గరుడవేగ సినిమా నిర్మాణం కోసం 26 కోట్ల రూపాయలను ఇచ్చామని ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఆ మొత్తం ఇవ్వగా ఆస్తులను బినామీల పేర్లకు మార్చి తమను మోసం చేశారని నిర్మాతలు వెల్లడించారు.

Advertisement

జోస్టర్ ఫిల్మ్ సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వరరాజు, ఎండీ హేమ ఈ విషయాలను వెల్లడించారు.తాము ఇబ్బంది పడుతున్నామని జీవిత ప్రమాదకరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని వాళ్లు తెలిపారు.

తమిళనాడు, నగరిలో కేసులు జరుగుతాయని నగరి కోర్టు వీళ్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా జారీ చేసిందని వాళ్లు పేర్కొన్నారు.జీవిత, రాజశేఖర్ తమను మోసం చేశారని త్వరలో రాజశేఖర్ జైలుకు వెళతారని నిర్మాతలు అన్నారు.

అయితే ఈ కామెంట్ల గురించి జీవిత, రాజశేఖర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.గరుడవేగ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు భారీగా లాభాలను అందించింది.జీవిత, రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తే మాత్రమే ఈ వివాదానికి తెరపడే అవకాశాలు అయితే ఉన్నాయి.

వైరల్ అవుతున్న వార్తల వల్ల రాజశేఖర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..
Advertisement

తాజా వార్తలు