పవన్ సక్సెస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన బడా ప్రొడ్యూసర్.. ఫోటోలు వైరల్!

సినీ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనంతరం రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన జనసేన పార్టీ( Janasena Party ) ని స్థాపించి రాజకీయాలలోకి అడుగు పెట్టారు.

దాదాపు పది సంవత్సరాలు తర్వాత ఈయన రాజకీయాలలో అనుకున్న స్థాయిలో విజయం సాధించారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఉన్నత స్థానంలో ఉండటంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

Producer Tg Vishwa Prasad Gives Grand Party For Pawan Winning Details, Tg Vishwa

పవన్ కళ్యాణ్ విజయాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గొప్ప వేడుక లాగా జరుపుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజారిటీతో గెలవడంతో చిత్ర పరిశ్రమ మొత్తం ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement
Producer Tg Vishwa Prasad Gives Grand Party For Pawan Winning Details, TG Vishwa

టాలీవుడ్ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) నిర్మాణ సంస్థలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Producer Tg Vishwa Prasad Gives Grand Party For Pawan Winning Details, Tg Vishwa

ఇక ఈ నిర్మాణ సంస్థ అధినేతగా టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) 100 సినిమాలను నిర్మించాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని వరుస సినిమాల నిర్మాణంతో బిజీగా గడుపుతున్నారు.పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన బ్రో( Bro ) సినిమాని కూడా నిర్మించారు.దీంతో పవన్ కళ్యాణ్ విశ్వప్రసాద్ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

దీంతో ఈయన గత రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో పవన్ కళ్యాణ్ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ సెలబ్రిటీలకు దర్శక నిర్మాతలకు పార్టీ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?
Advertisement

తాజా వార్తలు