ఇప్పుడైతే సినిమా పరిశ్రమలో పలు నిర్మాణ సంస్థలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి గానీ, ఒకప్పుడు అలా కాదు.సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న అతి కొద్ది సంఖ్యలో మాత్రమే కొందరు సినిమాలను నిర్మించేవారు.
ఆయా నిర్మాణ సంస్థలే పాతతరం నటులు హీరోలుగా ఎదగడానికి తోడ్పడేవి.అలా ఏళ్ళ పాటు తమను హీరోలుగా నిలబెట్టిన సంస్థల్లోనే ఇప్పటి బడా హీరోలు సినిమాలు చేస్తూ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేవారు.
అలాంటి గొప్ప పేరు సంపాదించుకున్న సంస్థల్లో “భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్” ఒకటి.భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనగానే ముందుగా నందమూరి బాలకృష్ణ గుర్తుకు వస్తారు.
ఎందుకంటే బాలయ్య అదే బేనర్లో బ్లాక్‌బస్టర్స్ చిత్రాలలో నటించి మెప్పించారు.ఇక ఆ బేనర్ నిర్మాత ఎస్.
గోపాలరెడ్డి అనే సంగతి నిన్నటితరం జనాలకు బాగా తెలుసు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ, గోపాలరెడ్డి ( Balakrishna, Gopalareddy )మధ్య అనుబంధం పెరిగింది.అయితే, నిర్మాత గోపాలరెడ్డి చివరి రోజులు మాత్రం చాలా దారుణంగా, దయనీయంగా గడిచాయని చెబుతూ ఉంటారు.ఫైనాన్షియర్‌గా ఇండస్ట్రీకి వచ్చి టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన ఎస్.గోపాలరెడ్డి, సినీ జీవితం నల్లేరు మీద నడకలాగా సాగింది.1949లో నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జన్మించిన ఎస్.గోపాలరెడ్డి మొదట సినిమా ఫైనాన్షియర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తర్వాత మిత్రులతో కలిసి చిలిపి చిన్నోడు, దాహం దాహం అనే అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేశారు.ఈ క్రమంలో తన కుమారుడు భార్గవ్ పేరు మీద భార్గవ్ ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా మనిషికోచరిత్ర చిత్రాన్ని నిర్మించారు.
ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది.దాంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఈ క్రమంలోనే తమిళ్‌లో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన ‘మన్‌వాసనై‘ చిత్రం ఆయనకు బాగా నచ్చి, అది బాలకృష్ణకు అయితే సరిగ్గా సూట్ అవుతుందని బావించి బాలకృష్ణతో చేయగా సూపర్ హిట్ అయింది.ఆ సినిమానే ‘మంగమ్మగారి మనవడు’( Mangammagari Manavadu).ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయి, బాలకృష్ణను ఒక్కసారిగా స్టార్ హీరోను చేసేసింది.దాంతో బాలకృష్ణ, ఎస్.
గోపాలరెడ్డి కాంబినేషన్‌లోనే ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య వంటి సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి.ఇక ఆ తరువాత చేసిన సినిమాలు మాత్రం వారికి అంతగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి.
మాతోపెట్టుకోకు అనే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత బాలకృష్ణతో ఒక సూపర్‌హిట్ సినిమా చెయ్యాలన్న పట్టుదలతో విక్రమసింహ భూపతి అనే జానపద చిత్రాన్ని గోపాలరెడ్డి నిర్మించగా అవి కూడా అంతగా ఆడలేదు.అయితే ఆయా సినిమాలు ప్లాప్ అవుతాయని అప్పటి నిర్మాత, గోపాల్ రెడ్డి గారికి సన్నిహితుడు అయినటువంటి మరో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) చెప్పకనే చెప్పారట.
కానీ గోపాల్ రెడ్డి ఆయన మాటలు లెక్క చేయక సినిమాలు తీయగా అంతవరకూ ఆయన కూడబెట్టుకున్న సొమ్ము అంతా కూడా ఆవిరి అయిపోయిందట.దీంతో ఆయన మానసికంగా, ఆర్థికంగా బాగా కుంగిపోయారు.
ఆ దిగులుతోనే 2008లో ఆయన తుది శ్వాస విడిచారు.తండ్రి మరణం తర్వాత సినిమాల జోలికి వెళ్ళకుండా ఇతర వ్యాపారాలతో బిజీ అయిపోయారు భార్గవరెడ్డి.