అక్కినేని నాగార్జున( Nagarjuna Akkineni) మొదట ఎన్నో రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా సినిమాల్లో నటించి మెప్పించాడు.తర్వాత డివోషనల్ మూవీస్ చేస్తూ అలరించాడు.
నాగార్జున చేసిన భక్తిరస చిత్రం “అన్నమయ్య( Annamayya ) (1997)” సూపర్ హిట్ అయింది.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ బాబు, సుమన్, రమ్యకృష్ణ, రోజా కూడా ప్రధానపాత్రలు పోషించారు.
ఇందులో నాగార్జున అక్కినేని 15వ శతాబ్దపు స్వరకర్త అన్నమాచార్య క్యారెక్టర్ చేశాడు.నటుడు సుమన్ వెంకటేశ్వర స్వామి వేషం ధరించాడు.
అన్నమాచార్య శ్రీవారికి గొప్ప భక్తుడు అనే సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో అన్నమాచార్య (నాగార్జున) వెంకటేశ్వర స్వామి (సుమన్) పాదాలపై పడి తన భక్తిని చాటుకునే సన్నివేశం ఉంటుంది.
నాగార్జున ఈ సీన్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం తెలపలేదు.పాదాలపై పడి ఆయన కాళ్లను తన కళ్లకు అద్దుకోవడం జరుగుతుంది.భక్తులు దేవుడు ముందు ఎలా సరెండర్ అయిపోయి ఆయన పాదాలను తమ కళ్ళకు అద్దుకుంటారో అలానే నాగార్జున సుమన్ ( Suman )పాదాలపై పడిపోయారు.
ఈ సీన్ చూశాక చాలామంది ఆశ్చర్యపోయారు.టాలీవుడ్ ఇండస్ట్రీ 4 పిల్లర్లలో నాగార్జున ఒకడు.శివ, నిన్నే పెళ్లాడతా, గీతాంజలి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.అంత పెద్ద యాక్టర్ సుమన్ లాంటి మాములు యాక్టర్ పాదాలపై పడిపోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి నాగార్జునను ప్రశ్నించారు.ఆ ఇంటర్వ్యూయర్ నాగ్‌ను ఉద్దేశించి “నటుడు సుమన్ మీరు ఆయన కాళ్ల మీద పడిపోతారు అని చెప్పినప్పుడు చాలా నెర్వస్ గా ఫీల్ అయ్యారు.హమ్మో, ఆయన నా కాళ్ల మీద పడటం ఏంటి అని అభ్యంతరం కూడా తెలిపారట.
ఆ సన్నివేశాన్ని తలుచుకుంటేనే తనకు చాలా భయమేస్తుంది అన్నారు.ఆ సమయంలో మీరు ‘ఇది యాక్టింగ్ మాత్రమే ఆ సీన్ చేయాలంటూ’ తనని తిట్టినట్లు కూడా గుర్తు చేసుకున్నారు.” అని చెప్పుకొచ్చింది.ఇలా చెబుతూ ఉంటే మధ్యలో నాగార్జున జోక్యం చేసుకున్నాడు.“ఈ సన్నివేశం గురించి నేను అసలు ఫీల్ కాలేదు.అందులో తప్పేముంది.
నేను వయసులో పెద్ద కాబట్టి సుమన్ ఫీల్ అయిపోయి ఉంటాడు.సుమన్ దేవుడు కాదు కానీ యాక్టింగ్ లో మాత్రమే నేను అతని పాదాలు పట్టుకున్నాను.
ఒకవేళ నిజంగా పట్టుకున్నా అందులో తప్పేంటి? ‘ఏయ్ నువ్వు నా కాళ్ళ మీద పడు’ అని అహంకారంతో ఎవరైనా అంటే అది తప్పు.కానీ సుమన్, నాలో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు.
అట్లాంటప్పుడు నిజ జీవితంలో పాదాలు పట్టుకున్నా తప్పులేదు.ఇది శరీరంలో ఒక భాగం మాత్రమే.””సుమన్ వెంకటేశ్వర స్వామి (VENKATESWARA SWAMY )అవతారంలో ఉన్నాడు.ఆయనకి కాకుండా ఆయన అవతారానికి నేను గౌరవం ఇచ్చి ఆయన పాదాలను పట్టుకోవడం జరిగింది.
మన ఆచారాలు, సాంప్రదాయాల్లో పెద్దల కాళ్లు మొక్కుతాం.అది వారి పట్ల మనం చూపించే గౌరవానికి సంకేతం.
మోకాళ్లు, తల కిందకు వంచామంటే అది నమస్కరించడం.మనకంటే గొప్పవాళ్లు, జీవితాన్ని ఎక్కువగా చూసిన వారికి ఇలా నమస్కరించడంలో తప్పులేదు.ఇలా చేయడం ద్వారా వారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు అవుతుంది.” అని నాగార్జున వివరించాడు ఈ మాటలు విన్న ఇంటర్వ్యూయర్ మతి పోయినట్లు రియాక్టైంది.ఇలాంటి యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారంటూ ఆమె కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చింది.ఆ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.