నల్లత్రాచు ను పట్టుకున్న ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నల్ల త్రాచు ను పట్టుకున్న ఘటన యూపీ లో చోటుచేసుకుంది.

యూపీ లోని రాయ్ బరేలి లో ప్రచారం కోసం అని వెళ్లిన ప్రియాంక అక్కడ పాములు పెట్టె వారితో మాట్లాడి వారు కష్ట సుఖాలను పంచుకున్నారు.

ఈ క్రమంలో ఆమె పాములు అంటే ఏమాత్రం భయం లేకుండా నల్ల త్రాచును పట్టుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.అనంతరం ఆమె అమేథీ నియోజక వర్గం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు.ప్రధాని మోడీపై వారణాసి లో పోటీ చేయడానికి భయపడ్డారా అని అక్కడి విలేఖరులు ప్రశ్నించడం తో ప్రియాంక వారికి గట్టి సమాధానం ఇచ్చారు.

తాను ఎవరికీ భయపడను అని,ఒకవేళ భయపడి ఉంటే రాజకీయాల్లోకి రాకుండా ఇంట్లోనే కూర్చొనే దాన్ని అని ఆమె వ్యాఖ్యానించారు.మంచికోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప వేరే ఏదో ఆశించి మాత్రం నేను రాజకీయాల్లోకి రాలేదు అని స్పష్టం చేసారు.

Advertisement

అలానే వారణాసి నుంచి పోటీ చేయనందుకు నేనేమీ బాధపడడం లేదు.ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేసి ఉంటే కేవలం ఆ ఒక్క నియోజక వర్గానికే పరిమితం కావాల్సి వచ్చేది, కానీ ప్రస్తుతం 41 లోక్ సభ స్థానాల భాద్యత నా మీద ఉంది కావున నేను దానిపై దృష్టి పెట్టినట్లు ఆమె తెలిపారు.

వారణాసి లో పోటీ చేసిఉంటే ఈ 41 నియోజక వర్గాల అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యేవాళ్లని అందుకే వారణాసి నుంచి పోటీ చేయడం లేదని ఆమె వివరించారు.అంతేకాకుండా పార్టీ నిర్ణయం మేరకే పోటీ చేయడం లేదు తప్ప ఎవరికో భయపడి మాత్రం కాదని ఆమె బదులిచ్చారు.

కాగా గత వారం వారణాసి కాంగ్రెస్ అభ్యర్థి గా అజయ్ రాయ్‌ను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు