పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రియాంక చోప్రా.. ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో క్లారిటీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా, గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె 2018 సంవత్సరంలో అమెరికన్ పాప్ సింగర్ నిక్‌జొనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

వయసులో తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న జంట తమ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా శుభవార్తను తెలియజేశారు.ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ జంట స్పందిస్తూ వారు సరోగసీ విధానం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చామనే విషయాన్ని తెలియజేశారు.

ఈ క్రమంలోనే మాకెంతో సంతోషం ఇచ్చిన ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ సమయానికి, మా ప్రైవసీకి భంగం కల్పించ వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ జంట అభిమానులను పేర్కొన్నారు.

ఇలా సరోగసీ విధానం ద్వారా పండంటి బిడ్డకు జన్మనిస్తూ తల్లిదండ్రులైన ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్‌ దంపతులకు పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం తన భర్తతో కలిసి ప్రియాంక చోప్రా లాస్ఏంజేల్స్ లో నివాసముంటూ వరుసగా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

Advertisement
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు