మగాళ్లే ఆ పనికి భయపడతారు, అలాంటిది ప్రియాంక చేసింది.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది

ఎంత అభివృద్ది చెందినా కూడా మనది భారతదేశం.అభివృద్దిలో దూసుకు పోతూనే మనకంటూ ఉన్న కొన్ని కట్టుబాట్లను కొనసాగించాల్సిన అవసరం ఉంది.

 Priyanka Chopra Drinking In Live In American Show-TeluguStop.com

అభివృద్ది పేరుతో ఆ కట్టుబాట్లను, మన పద్దతులను వదిలేస్తే ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఉన్న ప్రత్యేకత అనేది పోతుంది.అందుకే విదేశాల్లో చాలా కామన్‌ అయిన విషయాలు ఇండియాలో కొందరు చేస్తే వారిపై విమర్శలు చేయడం సోషల్‌ మీడియాలో కనిపస్తూ ఉంటుంది.

ఉదాహరణకు ఫారిన్‌లో మహిళలు మందు తాగడం కామన్‌.కాని ఇండియాలో మాత్రం అలా కాదు.

ఇండియాలో ఈమద్య కాలంలో మహిళలు మద్యం తాగడం ఎక్కువ అవుతోంది.అయితే అది రహస్యంగా జరుగుతున్న కారణంగా పెద్దగా విమర్శలు లేవు.కాని ఒక లైవ్‌ షోలో అది కూడా ఒక మహిళ మద్యం తాగితే ఏమైనా ఉందా, మగాళ్లే లైవ్‌లో మద్యం తాగేందుకు ఆసక్తి చూపించరు.అలాంటిది హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఒక లైవ్‌ షోలో మద్యం తాగి అందరిని ఆశ్చర్య పర్చింది.

ఇప్పటికే ఈమె తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను పెళ్లి చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.తాజాగా ఇలా లైవ్‌లో మద్యం తాగడం వల్ల ఈమెపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఇండియాలో తాగడం అనేది ఒక తప్పుగానే భావిస్తారు.తాగేవారందరు కూడా తప్పు చేస్తున్నామనే భావనతోనే ఉంటారు.అయితే ఏదో వ్యసనం వల్ల తాగుగూ ఉంటారు.కాని అమెరికా వంటి దేశాల్లో మాత్రం సరదాగా తాగుతూ ఉంటారు.కాని ఏమాత్రం భయం లేకుండా, నిసిగ్గుగా ప్రియాంక చోప్రా లైవ్‌ షోలో మద్యం తాగడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.ఇలాంటి అమ్మాయిలను భారత సమాజం క్షమించకూడదంటూ సోషల్‌ మీడియాలో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube