ట్రైన్‌ టాయిలెట్‌ టబ్‌ లో కాలు ఇరికింది... గంట సేపు నరకయాతన, చివరకు ఏమైందంటే

కొన్ని ప్రమాదాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.వాటిని బయటకు చెప్పలేరు, చెప్పకుండా ఉండే పరిస్థితి కాదు.

 Leg Stuck In Train In Chennai-TeluguStop.com

ఉదాహరణకు బాత్‌ రూంలో జారి పడ్డాం అంటే అంతా నవ్వుతారు.కాని జారి పడ్డామనే విషయం చెప్పకుంటే మొదటికే మోసం వస్తుంది.

కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి చెందిన వ్యక్తి పళ్లు రుద్దుకునే బ్రష్‌ను పొరపాటను మింగేసిన విషయం తెల్సిందే.అయితే ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచాడు.

పరువు పోతుందని దాచి పెట్టాడు.కాని అతడు తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాడు.

చెన్నైలోని సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ఇదే పరిస్థితి ఎదురైంది.

ఏపీకి చెందిన భారతమ్మ అనే మహిళ చెన్నై సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులో టాయిలెట్‌లోకి వెళ్లింది.ఆమె ప్రమాద వశాత్తు కాలు టాయిలెట్‌ బేషిన్‌లోకి జారింది.ఆమె కాలు పూర్తిగా అందులో ఇరుక్కు పోవడంతో తిసేందుకు చాలా ప్రయత్నించింది.

కాలు ఇరుక్కు పోవడంతో బయటకు తెలిస్తే నవ్వుతారని మొదట తన కాలును తానే తీసుకునేందుకు ప్రయత్నించింది.ఆ సమయంలో ఆమె కాలుకు గాయం కూడా అయ్యింది.ఇక తన కాలు వచ్చే పరిస్థితి లేదని గట్టిగా కేకలు వేసింది.దాంతో సిబ్బంది కొందరు బాత్‌ రూం డోర్‌ను బద్దలు కొట్టి చూశారు.

భారతమ్మ కాలు అందులోంచి తీసేందుకు సిబ్బంది గట్టిగానే ప్రయత్నించారు.కాని కాలు పూర్తిగా అందులో ఇరుక్కు పోవడంతో పాటు, ఆమె సరిగా నిల్చునే పరిస్థితి లేదు.

దాంతో చేసేది లేక మొత్తం బేషిన్‌ను స్క్రూలు విప్పి బయటకు తీశారు.

ఆ బేషిన్‌తోనే ఆమె కాలును హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.రైల్వే హాస్పిటల్‌లో ఆమె కాలును అందులోంచి డాక్టర్లు మెల్లగా తీశారు.ఈ వింత సంఘటన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది.

భారతమ్మ దాదాపు గంట సేపు నరకయాతన అనుభవించిన తర్వాత ఆ బేషిన్‌ నుండి కాలు విజయవంతంగా తీయడం జరిగింది.ఆమె పరిస్థితికి ఎంతో మంది అయ్యో పాపం అనుకున్నారు.

అదే సమయంలో రైలు గంట ఆలస్యం అవ్వడంతో ఆమెను కొందరు తిట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube