ఎమోషనల్ అయిన నటి ప్రియమణి.. తనకు అలాంటి భర్త దొరికాడంటూ?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన ప్రియమణి ఒకవైపు యంగ్ హీరోలతో నటించి మరోవైపు సీనియర్ హీరోలతో కూడా సినిమాలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

పెళ్లికి ముందు కంటే పెళ్లి తర్వాత ఈ నటికి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

నారప్ప సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటించగా సినిమాలో ప్రియమణి అద్భుతంగా నటించడంతో ఆమె పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.తాజాగా కెరీర్, భర్త గురించి మాట్లాడిన ప్రియమణి తన భర్త గొప్పదనం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అసురన్ లో నటించిన మంజు వారియర్ నుంచి తాను ఎటువంటి సలహాలను తీసుకోలేదని ప్రియమణి చెప్పుకొచ్చారు.హీరో వెంకటేష్ తో కలిసి నటించాలనే కల తనకు ఈ సినిమాతో నిజమైందని ప్రియమణి అన్నారు.

దర్శకుని సూచనలతో డైలాగ్స్ చెప్పానని ఈ మూవీలోని పాత్ర కొరకు ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేయలేదని ఆమె అన్నారు.

Heroine Priyamani Interesting Comments About Her Husband, Challenging Role, Comm
Advertisement
Heroine Priyamani Interesting Comments About Her Husband, Challenging Role, Comm

పెళ్లి తర్వాత సినిమా ఆఫర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని ప్రియమణి తెలిపారు.అర్థం చేసుకునే భర్త తనకు దొరికారని తన దగ్గరకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా భర్తతో కచ్చితంగా చర్చిస్తానని భర్త గురించి గొప్పగా చెబుతూ ప్రియమణి ఎమోషనల్ అయ్యారు.తనను అర్థం చేసుకునే భర్త దొరికినందుకు లక్కీ అని ఆమె చెప్పుకొచ్చారు.

మంచీచెడులను బేరీజు వేసుకుని ఇద్దరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని ప్రియమణి చెప్పుకొచ్చారు.

Heroine Priyamani Interesting Comments About Her Husband, Challenging Role, Comm

నారప్పలో కొన్ని సన్నివేశాలు తనకు ఛాలెంజింగ్ గా అనిపించాయని ప్రియమణి అన్నారు.ఈ సినిమా షూటింగ్ జరిగే ప్రాంతంలో దుమ్ము ఎక్కువగా ఉండేదని దుమ్ము ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రేక్షకుల నుంచి నారప్ప మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడం గమనార్హం.

అయితే కథలో పెద్దగా మార్పులు చేయలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు