టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అందం, అభినయం కలగలిసిన అతికొద్ది మంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.
ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే తెలుగు,తమిళం,హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించింది మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది.ప్రస్తుతం బుల్లితెర పై ప్రసారమవుతున్న ఢీ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఢీ షోలో ప్రియమణి ఒక్కసారిగా బావోద్వేగానికి లోనయ్యింది.తాజాగా ఢీ ప్రోమోని విడుదల చేయగా అందులో కంటెస్టెంట్స్ సాయి, నైనిక ఇద్దరూ కలిసి ప్రియమణి ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
అందులో ప్రియమణి సినిమాల్లోకి రాక ముందు పడిన కష్టాలు మొదలుకొని అన్ని విషయాలను టచ్ చేస్తూ ఒక ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ని ప్రియమణి ప్రజెంట్ చేశారు.ఇక అందులో ముఖ్యంగా ప్రియమణి ప్రేమ వివాహం జరిగిన తీరు హైలెట్ గా నిలిచింది.
జడ్జిగా సీట్లో నుంచి కూర్చుని డాన్స్ పర్ఫార్మెన్స్ నే చూస్తున్న ప్రియమణి తన భర్తని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది.

పర్ఫామెన్స్ అయిపోయిన తరువాత ప్రియమణి సాయి, నైనిక, కొరియోగ్రాఫర్ సాయి కలసి ప్రియమణి తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటో ని గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ పెయింటింగ్ ని చూసిన ప్రియమణి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయింది.అయితే ప్రియమణికి తన అమ్మమ్మ అంటే ఎంత ఇష్టమో ఇదివరకే చాలా సార్లు లైవ్ లోనే చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ప్రియమణి నేడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి, నటిగా ఇంతటి గొప్ప స్థాయికి ఎదగడానికి అసలు కారణం తన అమ్మమ్మ అంటూ చెబుతూ ఏడ్చేసింది.తన అమ్మమ్మ సహకారం లేకపోతే తాను ఈ రోజు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అంటూ స్టేజీపైనే ఎమోషనల్ అయ్యింది.
దానితో అక్కడున్న వారు కూడా ప్రియమణి ని చూసి ఎమోషనల్ అయ్యారు.







