నా ఈ స్టేటస్ కు ప్రశాంత్ నీలే కారణం.. భువన్ గౌడ!

కేజిఎఫ్ సినిమా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు దర్శకుడు ప్రశాంత్ నీల్,హీరో యష్. ఆ తరువాత డైరెక్టర్ రవి బస్రుర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణిల పేర్లు గుర్తుకు వస్తాయి.

 Bhuvan Gowda Talks About Director Prasanth Neel Details, Bhuvan Gowda, Prashant-TeluguStop.com

కే జి ఎఫ్ సినిమా అంతటి విజయం సాధించడం వెనుక వీరందరికీ కృషితో పాటు ఎంతోమంది కృషి దాగి ఉంది.వీరందరూ కలసి తక్కువ బడ్జెట్ లో కేజీఎఫ్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

కేజిఎఫ్ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయే రేంజ్ లో ఈ సినిమా విజయాన్ని నమోదు చేశారు.

అయితే ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా నుండి ప్రతి సినిమాకు ఎవరో ఒక టెక్నీషియన్ కి లైఫ్ ఇస్తూనే వస్తున్నారు.అలాంటి వారిలో సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కూడా ఒకరు.

మొదట ఒక ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన భువన్, ఎవరి దగ్గర అసిస్టెంట్ గా పని చేయకుండానే సినిమాల్లోకి స్టిల్ ఫొటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు.

Telugu Bhuvan Gowda, Bhuvangowda, Prasanth Neel, Kgf Chapter, Prashanth Neel, Ph

ఆ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ఉగ్రమ్ కి ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన సమయంలో, ప్రశాంత్ నీల్ సినిమాటోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చి భువన్ ని డీవోపీ చేశాడు.ప్రస్తుతం ప్రపంచమంతా కొనియాడుతున్న భువన్ గౌడ తనకు వర్క్ నేర్పించి ఈ స్థాయికి తీసుకు వచ్చి తన లైఫ్ ను మార్చింది మాత్రం ప్రశాంత్ నీల్ అని చెప్పుకొచ్చారు.అంతేకాకుండా నేడు తాను ఈ స్థాయిలో ఉండడానికి అసలు కారణం ప్రశాంత్ నీల్ అని తెలిపారు భువన్ గౌడ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube