వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ( Priya Prakash Warrier )ఒరు ఆదర్ లవ్ టీజర్ తో నేషనల్ లెవెల్ లో రచ్చ చేసింది.ఆ సినిమా తెలుగులో లవర్స్ డే( Lover’s Day ) గా రిలీజైంది.
అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి మరి ఆ సినిమా ఈవెంట్ హిట్ చేశాడు.అయితే టీజర్ తో వచ్చిన క్రేజ్ సినిమా నిలబెట్టుకోలేకపోయింది ఆ టీజర్ టైం లోనే ప్రియాకి తెలుగులో వరుస ఆఫర్లు రాగా అప్పుడు అమ్మడు వద్దనేసింది.
తీరా ఆ సినిమా ఫ్లాప్ అయ్యి సినిమాలో విషయం ఏం లేదని తెలిసిన తర్వాత ప్రియా తనంతట తాను వచ్చి సినిమా ఛాన్స్ లు అడిగిన మన మేకర్స్ లైట్ తీసుకున్నారు.
ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ ఫోటో షూట్స్ తో కాల వెళ్లదీస్తున్న అమ్మడు తెలుగులో ఒక హిట్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.రీసెంట్ గా వచ్చిన శ్రీలీల ( Srileela )తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోగా తనకు ఎందుకు తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోవట్లేదని బెంగ పెట్టుకుంది ప్రియా ప్రకాష్.అందుకే తన గ్లామర్ తో మేకర్స్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తుంది.
ప్రియా ప్రకాష్ వారియర్ కి ఒక్క తెలుగు మూవీ ఛాన్స్ వస్తే తన సత్తా చాటాలని చూస్తుంది.