ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలి - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించిన సీఎస్ & తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి.రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు.

హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, పత్తి పంట కొనుగోలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ లతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ,గ్రూప్ 1పరీక్షలు మాదిరిగానే నవంబర్ 17, 18న జరిగే గ్రూప్ 3 పరీక్షల పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు.

స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షిట్ల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల చెక్ చేసేందుకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలని సిఎస్ తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని, మరో 5.6 లక్షల మెట్రిక్ టన్నుల దానం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని అధికారులు తెలిపారు.జిల్లాలో ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం,ధాన్యం కొనుగోలు, ధాన్యం తరలింపు అంశాలను పరిశీలించాలని సీఎస్ తెలిపారు.

కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లు కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించాలని, దొడ్డు వడ్లు కల్వకుండా చూడాలని అన్నారు.ధాన్యం డబ్బులు చెల్లింపులకు ఆలస్యం అవుతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని, వివరాలు నమోదు చేసిన ,48 గంటలు వ్యవధిలో నగదు చెల్లించడం జరుగుతుందని అన్నారు.

Advertisement

రాష్ట్రంలో సీ.సీ.ఐ.ద్వారా 76 వేల మెట్రిక్ టన్నులో పత్తి కొనుగోలు చేశామని అన్నారు.ప్రస్తుత సీజన్ లో దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల పంట వస్తుందని అంచనా ఉందని అన్నారు.

జిన్నింగ్ మిల్లులతో ఉన్న సమస్య పూర్తయిందని, కలెక్టర్లు పత్తి పంట కొనుగోలు పై సైతం శ్రద్ధ వహించాలని, 300 పైగా పత్తి పంట కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించామని అన్నారు.సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియ రాష్ట్రంలో ఇప్పటి వరకు 21% పూర్తి చేసామని తెలిపారు.

నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించాలని అన్నారు.సర్వే వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు అవసరమైన మేర కంప్యూటర్ సిస్టంలను సిద్ధం చేయాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ, గ్రూప్ 3 పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని, 5 లక్షల 36 వేల 395 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని తెలిపారు.పరీక్ష హాల్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పెళ్లి వేడుకపై గుండెపోటుతో పెళ్ళికొడుకు స్నేహితుడు మృతి (వీడియో)
రాజన్న ఆలయంలో సామూహిక కార్తీక దీపోత్సవం సందర్భంగా వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు

పోలీసు బందోబస్తు మధ్య ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించాలని ఎక్కడ ఎటువంటి పొరపాటు రాకుండా చూసుకోవాలని అన్నారు.గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని తెలిపారు.

Advertisement

పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన మేర పోలీస్ సిబ్బందిని చెకింగ్ కోసం అందుబాటులో ఉంచాలని అన్నారు.పరీక్షలు నిర్వహించే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందజేయాలని అన్నారు.పరీక్ష రాసే విద్యార్థులకు అవసరమైన త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, పరీక్ష కేంద్రాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలని, బెల్ ఏర్పాట్లు చేయాలని, పరీక్ష కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, ఎవరు ఫోన్ తీసుకొని రావద్దని అన్నారు.

పరీక్షా కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1.30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్, సిపిఓ శ్రీనివాస చారి, డి ఆర్ డి ఓ శేషాద్రి, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి వసంత లక్ష్మి, మేనేజర్ పౌర సరఫరాల శాఖ,రజిత, డి సి ఓ రామకృష్ణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News