మోడీ భోజనానికే ప్రాధాన్యం

ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా మీడియా ఎక్కువగా ఆయన భోజనానికే ప్రాధాన్యం ఇస్తుంది.ఆయన పర్యటన కంటే ఆయన ఎవరితో కలిసి భోజనం చేస్తారు? భోజనంలో ఏ పదార్థాలు ఉంటాయి? మోడీ భోజన అలవాట్లు ఏమిటి?.

ఇలాంటి విషయాల మీదనే ఎక్కువ కథనాలు వస్తుంటాయి.

మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో విదేశాలకు వెళ్ళారు.ఇంకా వెళుతూనే ఉన్నారు.ఈ రోజు నుంచి అంటే దీపావళి నుంచి మూడు రోజుల బ్రిటన్ పర్యటనకు వెళుతున్నారు.

మనకు రాష్ట్రపతి మాదిరిగా బ్రిటన్కు రాణి ఉంది కదా.ఆమెతో కలిసి మోడీ లంచ్ చేస్తారు.ఇప్పుడు మీడియాకు ఇది పెద్ద వార్త అయింది.

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మొదటిసారిగా విదేశాలకు వెళుతున్నారు.అయితే క్వీన్ ఆఫ్ ఇంగ్లాండుతో మోడీ లంచ్ ఎలా ఉంటుంది? ఈయన శాకాహారి.కాబట్టి అక్కడ ఏ ఏ పదార్థాలు వడ్డిస్తారు? అనేది మీడియాకు ఆసక్తికరంగా మారింది.గతంలో దసరా నవరాత్రుల సమయంలో అమెరికా వెళ్ళినప్పుడు కూడా మోడీ భోజనం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

అందులోనూ దసరా రోజుల్లో మోడీ భోజనం విషయంలో నిష్టగా ఉంటారు.కేవలం పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటారు.ప్రధాని, రాష్ట్రపతి ఇలాంటి ప్రముఖులు విదేశాలకు వెళ్ళినప్పుడు వారి ఆహారపు అలవాట్ల గురించి అధికారులు ముందుగానే సమాచారం అందిస్తారు.

కాబట్టి అందుకు అనుగుణంగానే ఆహారం సిద్ధం చేస్తారు.ప్రముఖుల విషయంలో ప్రతి అంశం మీడియాకు ఆసక్తికరంగానే ఉంటుంది మరి.

Advertisement

తాజా వార్తలు