ప్రధాని మోడీ ఈరోజు ఉదయం ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు.వర్చువల్ విధానం ద్వారా జరగనున్న ఈ సమావేశానికి మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
కరోనా వైరస్ తీవ్రత అదేరీతిలో వ్యాక్సినేషన్ వంటి విషయాలపై ప్రధాని మోడీ చర్చించనున్నట్లు సమాచారం.ముఖ్యంగా త్రిపురలో డెల్టా ప్లస్ వేరియంట్ భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో.
ప్రధాని మోడీ వైరస్ తీవ్రత గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడనున్నారు.

ఇప్పటికే త్రిపురా లో ఆర్ ఫ్యాక్టర్ ఒకటికి మించి ఎక్కువగా ఉండటంతో చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ పరిశోధన బృందం ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే మరో పక్క దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఇంకా తగ్గి పోలేదని వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.ఖచ్చితంగా ప్రజలంతా కరుణ నిబంధనలు పాటించాలని పేర్కొంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడ కూడా.కరోనా నిబంధనలు పాటించిన దాఖలాలు కనబడటం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ఈశాన్య రాష్ట్రాలలో ప్రధాని మోడీ ముఖ్య మంత్రులతో భేటీ అయిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నది చర్చనీయాంశంగా మారింది.