తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఏపీ సీఎం చంద్రబాబు కి మధ్య ఇప్పుడు రాజకీయ వైరం ముదిరిపోయింది.మొన్నటివరకు టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగా తెలంగాణ ఎన్నికల ముందు చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేయడంతో పాటు… కేసీఆర్ ని అనరాని మాటలు అన్నాడు.
ఎన్నో వ్యూహరచనలు చేసాడు.కానీ ఫలితం మాత్రం దక్కలేదు.
అయితే కేసీఆర్ మాత్రం చంద్రబాబు చేసిన ప్రతి విమర్శను గుర్తుపెట్టుకున్నాడు.

అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరమే… ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద కక్ష తీర్చుకోబోతున్నా అంటూ… పరోక్షంగా సంకేతాలు పంపాడు.అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వం ఏపీ లో అధికారం రాకుండా అన్ని రకాలుగా అడ్డుకుంటానని… ఏపీలో సభలు… సమావేశాలు పెట్టి మరీ చంద్రబాబు జాతకం మొత్తం చెబుతానని ప్రకటించాడు.

ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏపీ రాజకీయాల్లో తమ జోక్యం ఉంటుందని పదేపదే కేసీఆర్, కేటీఆర్ చెబుతూనే ఉన్నారు.చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేశారు కనుక టీఆర్ఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామనే సంకేతాలను కేసీఆర్, కేటీఆర్ పంపుతున్నారు.హైదరాబాద్ లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమకు మద్దతుగా నిలువడంపై ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాదు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే టీఆర్ఎస్ విజయానికి సహాయపడింది అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు.కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే… ఏపీ ఓటర్లు ఎక్కువగా ఉన్నా… టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి మరీ… ఆర్భాటం చేసినా అక్కడ సీటు దక్కించుకోలేకపోయింది అనే వాదనను కేసీఆర్ తెరమీదకు తెస్తున్నాడు.

తెలంగాణాలో ఇప్పటికే తామెంతో నిరూపించుకున్నాం కనుక ఏపీలోనూ… ప్రజలు తమను ఆదరిస్తారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే… ఏపీలో ఆ పార్టీకి మద్దతుగా ర్యాలీలు చేయడం… భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం… ఇవన్నీ అనుకూల వాతావరణంగా టీఆర్ఎస్ భావిస్తోంది.ఇక్కడ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయకపోయినా చంద్రబాబు ప్రత్యర్థి పార్టీలకు అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించి టీడీపీని మట్టి కురిపించాలని చూస్తోంది.అదీకాకుండా కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలవైపు చూస్తుండడంతో….అక్కడ చంద్రబాబు హవా పెరగకుండా … టీఆర్ఎస్ హవా పెంచుకోవాలని కేసీఆర్ చూస్తున్నాడు.అందుకే… జగన్ పవన్ లకు మద్దతుగా నిలబడేందుకు… అవసరమైతే చంద్రబాబు కి వ్యతిరేకంగా… వీరిద్దరిని కలిపేందుకు కూడా… కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.







