తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఏంటో… ఆ బ్యాంక్ మేనేజర్ నిరూపించాడు.అంతే కాదు… పనిచేసే బ్యాంకుకి కన్నం వెయ్యడంలో తన ‘చిల్లర’ మనస్తత్వం చూపించుకున్నాడు.తనకు ఉన్న లాటరీ పిచ్చితో… ఎవరికీ తెలియకుండా… ఏకంగా… రూ.84లక్షలు నొక్కేశాడు.అది కూడా ఎవరికీ అనుమానం రాకుండా చిల్లర రూపంలో.చాలాకాలంగా సాగుతున్న ఈ తంతు ఒక్కసారే బట్టబయలయ్యింది.

పూర్తి వివరాలు పరిశీలిస్తే….కోల్‌కతాకు సమీపంలోని మెమరీ అనే పట్టణంలో జైశ్వాల్ ఎస్‌బీఐ బ్యాంకులో సీనియర్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.బ్రాంచ్ కరెన్సీ ఛెస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న జైశ్వాల్.చేతివాటం చూపించాడు.ఎవరికీ తెలియకుండా చిల్లర నాణేలను ఎత్తుకెళ్లేవాడు.గత నెలలో బ్యాంకు ఆడిట్ నిర్వహించగా.
చిల్లర నాణేల లెక్కింపులో తేడా వచ్చింది.ఆ తర్వాత నుంచి జైశ్వాల్ బ్యాంకుకు ఎగనామం పెడుతూ వస్తున్నాడు.
అంతే కాదు.జైశ్వాల్ తరుచు… సెలవులు తీసుకోవడంతో బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది.వెంటనే… బ్యాంకుకు రావాలని కబురు పంపారు.
అయితే అతగాడు రాకుండా… తన భార్యతో కరెన్సీ ఛెస్ట్ తాళాలు ఇచ్చి పంపించాడు.
దీంతో అతడే డబ్బును చోరీ చేశాడనే క్లారిటీకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.అతడ్ని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో చేసిన తప్పును ఒప్పుకున్నాడు.రూ.10నాణేల రూపంలో.17 నెలల్లో డబ్బును చోరీ చేసినట్లు చెప్పాడు.ఇలా మొత్తం రూ.84లక్షలు తీసుకెళ్లినట్లు గుర్తించారు.ఈ డబ్బుతో లాటరీ టికెట్లు కొన్నట్లు తెలుస్తోంది.






