ఈనెల 7న తెలంగాణకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు.

ఈ మేరకు ఈనెల 7 వ తేదీన హైదరాబాద్ కు రానున్న ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొననున్నారు.

తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదే అంశాన్ని మోదీ సభా వేదికపై నుంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోదీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు