యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన సలార్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి చాలా రోజులు అయింది.ఈ సినిమా యొక్క విడుదల తేదీ విషయం లో గత కొన్నాళ్లుగా అనేక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఎట్టకేలకు సలార్ సినిమా ను క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.సలార్ ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ రెండో భాగాన్ని లేపేసే ఆలోచనలో ఉన్నారట.
రెండు భాగాలుగా విడుదల చేసేంత స్కోప్ సలార్ స్క్రిప్ట్ కి లేదు అంటూ ఒక నిర్ణయానికి వచ్చారట.అందుకే సలార్ సినిమా( Salaar movie ) ను భారీ ఎత్తున రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది.అతి త్వరలోనే సెకండ్ పార్ట్ లేదు సింగిల్ పార్ట్ లోనే సినిమా వస్తుంది అంటూ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యం లో సలార్ సినిమా యొక్క బిజినెస్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.ఇప్పటికే రెండు భాగాలు అంటూ బిజినెస్ చేశారు.
ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సలార్ సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్రిస్మస్ కు సినిమా ను విడుదల చేయకుండా, ఆ తర్వాత విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.క్రిస్మస్ కి విడుదల చేయక పోవడంకు కారణం ఏంటి అంటే రెండో పార్ట్ ని కూడా మొదటి పార్ట్ లో జత చేయాలని నిర్ణయించుకున్నారు.
అందుకే రీ ఎడిటింగ్ అవసరం అని భావిస్తున్నారు.అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమా ( Salaar movie )యొక్క మేకర్స్ నుంచి ఒకటి రెండు వారాల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.