బీఆర్ఎస్ హయాంలోనే వర్షాభావ పరిస్థితులున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.రైతుల పంట నష్టానికి వర్షాభావ పరిస్థితులే కారణమని తెలిపారు.
తాగు, సాగునీటిపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.మాజీ సీఎం కేసీఆర్( KCR ) పర్యటన చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
ప్రతిపక్ష నేతగా ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని చెప్పారు.రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.బీజేపీ నేతలు మొసలి కన్నీరు కారుస్తుందన్న మంత్రి పొన్నం బీజేపీ నేతలు గల్లీలో కాదు ఢిల్లీలో దీక్షలు చేయాలని సూచించారు.







