Pregnant Canadian Woman iPhones : ఐ ఫోన్స్ కావాలా....భారత అత్తా మామలకు షాక్ ఇచ్చిన కెనడా కోడలు... !!

బహుమతులు అడగటంలో తప్పులేదు కానీ అడగడానికి సమయం సందర్భం ఉండాలి అలాగే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా ఆర్థం చేసుకోవాలి.

లేదంటే అవతలి వారి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంటుంది, ఎంతో మానసిక సంఘర్షణకు కూడా లోనవుతారు.

భారత్ నుంచీ విదేశాలకు వెళ్ళిన అందరి ఆర్ధిక పరిస్థితులు అమాంతం పెరిగిపోవు.కొందరికి కొంత సమయం పడుతుంది అక్కడ ఆర్ధికంగా స్థిరపడటానికి మరి కొందరికి షార్ట్ పిరియడ్ లోనే బాగా డబ్బు సంపాదిస్తారు.

అయితే ఈ విషయాలు ఏవి కూడా భారత్ లో ఉండే వారి కుటుంబ సభ్యులకు, భందువులకు, స్నేహితులకు తెలియదు.తాజా ఓ మహిళ పెట్టిన పోస్ట్ ఇలాంటి వారందరికీ కనువిప్పు చేస్తుంది.

వివరాలలోకి వెళ్తే.భారత్ నుంచీ కెనడాకు ఉద్యోగం కోసం వెళ్ళిన ఓ వ్యక్తీ ఉద్యోగం సంపాదించడంతో పాటు అక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

అక్కడే స్థిరపడ్డాడు.ప్రస్తుతం అతడి కెనడా భార్య గర్భవతి కూడా.

అయితే ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.తాను కడుపుతో ఉన్నానని, ఈ సమయంలో కొంత ఆర్ధిక సమస్యలు తమను చుట్టుముట్టాయని, ఇదే క్రమంలో బిడ్డ బయటకు వచ్చే సమయం కావడంతో మరింత ఖర్చులు అవుతాయని కానీ భారత్ లో ఉన్న మా అత్తా మామలకు ఇవేమీ పట్టకుండా ఐ ఫోన్స్ రెండు కొని పంపాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

తమ ఆర్ధిక పరిస్థితి సరిగా లేకపోయినా, త్వరలో బిడ్డ బయటకు వస్తాడని తెలిసినా తన భర్త ఇబ్బందులు పడుతూ తమ తల్లి తండ్రులకు ఐ ఫోన్స్ కొనడానికి సిద్దమయ్యారని ఈ విషయం నన్ను ఎంతో షాక్ కి గురిచేసిందని చెప్పుకొచ్చింది.అత్త మామలు అసలు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని అడగడం మంచిది కానీ వారు ఇవేం పట్టించుకోలేదు ఈ విషయం నన్ను ఏంటో బాధిస్తోంది, పరిస్థితులు అనుకూలంగా ఉంటే కొనివ్వడంలో తప్పులేదు కానీ ఈ పరిస్థితిలో ఇలాంటి కోరికలు కోరడం సబబేనా, అర్థం చేసుకోండి అంటూ సున్నితంగా పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవడంతో భారత్ లోని చాలా మంది కెనడా కోడలుకు అనుకూలంగా స్పందించారు, మరి కొందరు మాత్రం కష్టపడి అతడిని చదివించారు, అక్కడికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే కారణం వాళ్ళేగా తెలిసో తెలియకో అడిగారు కష్టమో నష్టమో కొనిస్తే బాగుటుందిగా ఆలోచించు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?
Advertisement

తాజా వార్తలు