రసాయన మందులను పిచికారి చేసే సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు..!

ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయంలో( agriculture ) అధిక దిగుబడులు సాధించడం కోసం విచక్షణారహితంగా రసాయన పిచికారి మందులను అధిక మొత్తంలో ఉపయోగిస్తున్నారు.

ఫలితంగా పండిన పంటలో నాణ్యత అనేది లేకుండా పోతుంది.

వ్యవసాయం చేసే రైతులకు( Farmers ) ఏ సమయంలో రసాయన మందులు కొట్టాలి.ఎంత మోతాదులో పురుగుమందును కొట్టాలి.

అసలు పురుగుమందు కొట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందా అనే విషయాలపై అవగాహన తప్పనిసరి.చీడపీడల నివారణకు రసాయన పిచికారి మందులు కాకుండా వేరే పద్ధతులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.

పంట ఏదైనా రసాయన మందులను పిచికారి చేసే ముందు చీడపీడల( Pests ) వల్ల పంటకు నష్టం ఎంత ఉందో ముందు అంచనా వేయాలి.నష్ట శాతం ఆర్థిక పరిమితి స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయనం మందులు పిచికారి చేయాలి.అంటే పొలంలో పది శాతం మొక్కలు నష్ట పోయినప్పుడు మాత్రమే రసాయనాలు పిచికారి చేయాలి.

Advertisement

పిచికారి మందులను అవసరం అయినంత మేరకే కొనుగోలు చేసి, అవసరం అయినంత మేరనే కొంతకు పిచికారి చేయాలి.ఏ మందులు కొనుగోలు చేసిన ఎక్స్పైరీ తేదీ, తయారుచేసిన తేదీ, బ్యాచ్ నెంబర్, బిల్లు ఒకసారి చెక్ చేసుకోవాలి.

రసాయన పిచికారి మందులను ఉపయోగించే సమయంలో తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలు: స్ప్రే దావకం( Spray application ) తయారీకి పరిశుభ్రమైన నీరుని ఉపయోగించాలి.అవసరం అయినంత మేరకే స్ప్రే దావకం తయారు చేసుకోవాలి.స్ప్రే ద్రావకం తయారీ బకెట్ లేదా డ్రమ్ములో తయారు చేయాలి.

ద్రావకాన్ని చేతులతో కాకుండా ఒక కర్రతో కలపాలి.ద్రావకం తయారు చేసేటప్పుడు నీరు తాగడం, పొగ త్రాగడం( smoking ), గుట్కా నమ్మడం లాంటి పనులు చేయకూడదు.

ద్రావకం పోసే ముందే స్పేయర్ యొక్క పనితీరును పరీక్షించాలి.స్పేయర్ లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ప్రభాస్ కి ఏమిచ్చిన రుణం తీరదు.. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కామెంట్స్ వైరల్!

ఎట్టి పరిస్థితులలో స్ప్రే చేసేటప్పుడు వాసన చూడకూడదు.చేతులు, చెవులు, నోరు, కళ్ళు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.

Advertisement

గాలి ఎక్కువగా వీస్తున్న సమయంలో స్ప్రే చేయకూడదు.ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పంటకు స్ప్రే చేయాలి.

తాజా వార్తలు