ఏపీ సీఐడీ అదుపులో ప్రవాసాంధ్రుడు యశస్వి..!!

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసిన ప్రవాసాంధ్రుడు యశస్విని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు యశస్వి స్వదేశానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఎయిర్ పోర్టులో దిగగానే సీఐడీ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.అయితే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న యశస్వి సీఎం జగన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తుంటాడు.

మరోవైపు యశస్విని సీఐడీ అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు.జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే ద్రోహమా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలోనే యశస్వి ని విడిచి పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు