NTR Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రశాంత్ నీల్.. అలాంటి మూవీ అస్సలు కాదంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara ) నటిస్తూ ఫుల్ బిజీ బిజీ గా గడుపుతున్నారు.ఈ సినిమా తర్వాత వార్ 2( War 2 ) సినిమాలో నటించనున్నారు తారక్.

అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.ఇప్పటికే అందుకు సంబంధించి ప్రాజెక్టుని అనౌన్స్ చేయడం, వైలెంట్ పోస్టర్ని విడుదల చేయడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలపై అంచనాలను మరింత పెంచేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్.( Prashanth Neel ) డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్.( Salaar ) ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది.

Advertisement

ఆ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీనీల్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.ఎన్టీఆర్ తో చేసే మూవీ డిఫరెంట్ ఎమోషన్స్‌తో కూడిన డిఫరెంట్ ఫిల్మ్ అవుతుంది.

నేను జానర్‌ గురించి చెప్పను.కానీ అందరూ దీనిని యాక్షన్ చిత్రంగా భావిస్తున్నారని తెలుసు.

ఇది నాకు చాలా కొత్త కథ.

ఇది నా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను అని నీల్ చెప్పుకొచ్చాడు.గతంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన నీల్.ఇప్పుడు కథ చాలా కొత్తగా ఉంటుందని చెప్పడం బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ తో కలిసి ఏదో పెద్దగానో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తోంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

తాజాగా దర్శకత్వం వహించిన సలార్ సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా విడుదల ఈ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా భావిస్తున్నారు.

Advertisement

మరి సలార్ సినిమా ఎటువంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

తాజా వార్తలు