ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు బలమైన పునాదులు వేసే ఆలోచనలో ఉన్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.ఆ పార్టీలో ఆయన చేరకపోయినా, వ్యూహకర్తగా సేవలు అందిస్తున్నారు.
త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.అంతకంటే ముందుగానే ఏం చేస్తే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో ఉత్సాహం పెరుగుతుంది.
కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనే విషయం లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పెద్దలకు సలహాలు సూచనలు ఇస్తున్నారు.ఇప్పటి వరకు కాంగ్రెస్ బలం పెంచుకోలేకపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఆయన విశ్లేషిస్తున్నారు.
రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాకంటే ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అనే విషయం పైన ఆయన చర్చిస్తున్నారు.దీనిలో భాగంగానే ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సోనియాకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట.
తెలంగాణలో మాత్రం ఒంటరిగా పోరాటం చేయడం వల్ల లాభం ఉంటుందనే విషయాన్ని సోనియాకు అర్థమయ్యేలా ప్రశాంత్ కిషోర్ చెప్పారట.
దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని, తెలంగాణలో ఒంటరిగా, ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కలిసి వస్తుందని నివేదికలు అందించారట.
తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీ, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ లో జేఎంఎం తో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించారట.జమ్ము కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ , ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో పొత్తు పెట్టుకోవాలని , అప్పుడే కాంగ్రెస్ కు కలిసి వస్తుందని కొన్ని నివేదికలు సమర్పించారట.
బీజేపీతో ముఖాముఖీ తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని , మిగిలిన చోట్ల పొత్తులతో వెళ్ళడం వల్లే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారట.పీకే సలహాలు వరకు బాగానే ఉన్నా.
కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు ఆయా పార్టీలు మొగ్గు చూపుతాగా అనేది అనుమానమే.

ఏపీ విషయానికి వస్తే కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని జగన్ స్థాపించారు.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే జగన్ అక్రమాస్తుల కేసులు నమోదవడం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జగన్ మొదటి నుంచి పోరాటం చేయడం ఎలా ఎన్నో కారణాలతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు జగన్ ఏమాత్రం ఇష్టపడరు అనేది బహిరంగ రహస్యమే.