విశాఖలో టీడీపీ పాదయాత్ర.మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా గాజువాక నుండి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పల్లా శ్రీనివాసరావు పాదయాత్ర చేశారు.
పల్లా శ్రీనివాసరావు పాదయాత్రకు కార్యకర్తల నుంచి అశేష స్పందన.ఫుల్ జోష్ లో టీడీపీ కార్యకర్తలు.
పెంచిన విద్యుత్,ఆర్టీసీ, కరెంట్ చార్జీలు,నిత్యావసర వస్తువుల ధరలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై విశాఖ పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గాజువాక నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు.అడుగడుగున టిడిపి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, ఆదాయ వనరులు, యువతకు ఉద్యోగ అవకాశాలు, పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు నిత్యవసర వస్తువులు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు పక్షాన టిడిపి ప్రభుత్వం నిలబడుతూ గాజువాక నుంచి సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టామని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.జగన్మోహన్ రెడ్డి తల్లి ఓటమి చెందడంతో విశాఖ జిల్లా ని మరుగుజ్జు జిల్లా చేశారని పల్లా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ రాక్షస పాలన నుంచి సింహాద్రి అప్పన్న కాపాడాలని, మరలా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.







