వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి గాయాలు ..?  

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు… ప్రస్తుత రాజకీయాలను రెగ్యులర్ గా అనుసరించే వారికి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించి చెప్పనవసరం లేదు. ఆయన ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశాడు. ఇప్పుడూ చేస్తున్నాడు కానీ… ఆయన స్వయంగా పాల్గొనకుండా ఆయన టీమ్ ద్వారా మేనేజ్ చేస్తున్నాడు. ఇంతకీ ఇతని గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే… ప్రస్తుతం ఆయన … డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో చేతులు కలిపి జనతాదళ్ యునెటెడ్‌లో చేరారు.

Prasanth Kishore Is Injuries Attac By Abvp Followers-

Prasanth Kishore Is Injuries Attac By Abvp Followers

పాట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో జేడీయూ స్టూడెంట్స్ యూనియన్‌కీ, ఏబీవీపీకి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్‌తో మాట్లాడేందుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ మీద ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో.. ప్రశాంత్ కిషోర్ కూడా గాయపడినట్లు సమాచారం. కానీ నాకు ఏమీ కాలేదు అంటూ పీకే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.