' గడప గడప ' లో నిఘా ... రంగంలోకి పీకే టీమ్ ?

గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రభుత్వం జనాల్లోకి పార్టీ నాయకులు , అధికారులు వెళ్లే విధంగా ప్లాన్ చేసింది.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు,  ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,  వాటి కారణంగా ఏ కుటుంబం ఎంత మేరకు లబ్ధి పొందింది  ఇలా అనేక అంశాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.8 నెలల పాటు నిత్యం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగాలని ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేయడంతో,  పార్టీ క్యాడర్ అంతా గడప గడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో  పాల్గొంటున్నారు.అయితే ఈ కార్యక్రమాన్ని జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Prasanth Kishor Ipac Team Strict Monitoring On Ycp Gadapa Gadapaku Mana Prabhutv-TeluguStop.com

చాలా చోట్ల వైసీపీ మంత్రులను, ఎమ్మెల్యేలను , ప్రజా ప్రతినిధులను ప్రజలు వివిధ సమస్యలపై నిలదీస్తూ ఉండటం వంటి వ్యవహారాలు వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా మారాయి.  ఈ క్రమంలోనే గడపగడపకు మన ప్రభుత్వంలో ఏర్పడుతున్న ఇబ్బందులు,  ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది ? కేవలం ప్రజాప్రతినిధులపైనేనా లేక ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందా ఇలా అనేక అంశాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ తో నిఘా పెట్టినట్లు సమాచారం.

Telugu Ap, Chandrababu, Cmjagan, Gadapagadapaku, Ipac, Pk, Prasanth Kishor, Ysrc

క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితిని ఎప్పటికప్పుడు పీకే టీం నివేదికలను వైసీపీ అధిష్టానానికి పంపిస్తు ఉండడం తో వైసిపి పెద్దలు సదరు నాయకులను నిలదీస్తున్నారట.దీంతో తమ దగ్గర చోటు చేసుకుంటున్న సంఘటనల గురించి అధిష్టానం పెద్దలకు ఇంత స్పీడ్ గా ఎలా తెలుస్తుందో అంటూ నాయకులు టెన్షన్ పడుతున్నాడట.ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే విధమైన నిఘా ఏర్పాటు చేయడంతో ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ప్రయత్నిస్తూ జగన్ దృష్టిలో తమ పై చెడు అభిప్రాయం కలగకుండా జాగ్రత్తలు పడుతున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube