ప్రభుత్వాలకు భూముల అవసరం ఎంతో ఉంటుంది.ప్రభుత్వ కార్యాలయాలు స్థాపించాలన్నా, పరిశ్రమలకు ఇవ్వాలన్నీ భూములు కావాలి.
కేంద్ర ప్రభుత్వానికి కావాలన్నా రాష్ట్రాలే ఇవ్వాలి.తెలంగాణలో మూత పడిన ఆరు కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమల భూముల్ని అమ్మాలని కేంద్రం ఆలోచిస్తోంది.
అయితే ఆ భూములపై హక్కు తనదే అంటోంది తెలంగాణ సర్కార్.దశాబ్దాల నాడే కేంద్రానికి ఇచ్చేసిన భూములపై తెలంగాణ సర్కార్ కు హక్కు ఎలా ఉంటుంది? వాటిని కేంద్రం అమ్మాలనుకుంటే ఒప్పుకునేది లేదని, తామే అమ్ముకుంటామని చెబుతోంది కేసీఆర్ ప్రభుత్వం.
రాష్ట్రంలో ఎక్కడ భూములున్నా వెతికి అమ్ముకునే పనిలో పడింది తెలంగాణ సర్కార్.ముఖ్యంగా HMDA పరిధిలో భూములు బంగారంలా మారాయి.
ఒక్కో ఎకరానికి పదుల కోట్లలో ధర పలుకుతోంది.నిర్వహణ కష్టంగా మారిన తెలంగాణ ప్రభుత్వం భూముల్ని అమ్ముకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ప్రజావసరాల కోసం గతంలో HMDAకి భూములు బదలాయించారు.ఇప్పుడు వాటినే కేసీఆర్ ప్రభుత్వం అమ్మి సొమ్ము చేసుకుంటోంది.
భవిష్యత్ అవసరాలను విస్మరిస్తోంది.

ప్రభుత్వ భూముల్ని అమ్మడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది తెలంగాణ సర్కార్.ఇందుకోసం భూముల వేట కొనసాగిస్తోంది.ట్రిపుల్ వన్ జీవో రద్దు చేయడంతో వేల ఎకరాల భూములు అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్రంలోని లీజు భూములు, అసైన్డ్ భూములు, సీలింగ్ భూములపై పూర్తి సమాచారం తెప్పించుకుంటోంది.భూముల అమ్మకం ద్వారా ఏటా వేల కోట్లు పొందాలని ప్రణాళిక రచించింది.తాను అమ్ముకుంటూ కేంద్రం మీద విమర్శలు గుప్పిస్తోంది.ముఖ్యంగా HMDA పరిధిలో భూములు బంగారంలా మారాయి.
ఒక్కో ఎకరానికి పదుల కోట్లలో ధర పలుకుతోంది.నిర్వహణ కష్టంగా మారిన తెలంగాణ ప్రభుత్వం భూముల్ని అమ్ముకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
వాటిని కేంద్రం అమ్మాలనుకుంటే ఒప్పుకునేది లేదని, తామే అమ్ముకుంటామని చెబుతోంది కేసీఆర్ ప్రభుత్వం.







