తిరుపతి లడ్డు వివాదం.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ హీరోయిన్?

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పాల్సిన పనిలేదు.నిత్యం ఎంతో మంది భక్తులతో తిరుమల తిరుపతి ఎంతో రద్దీగా ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల శ్రీవారి (Sri Varu) ప్రసాదం విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.గత ఐదు సంవత్సరాల పాటు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైకాపా(YSRCP ) ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు(Laddu ) తయారీ కోసం స్వచ్ఛమైన ఆవు నెయ్యిని(Ghee ) కాకుండా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనె ఉపయోగించారు అంటూ ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

లడ్డూ తయారీలో ఇలా జంతువుల కొవ్వు కలిపి తాయారు చేశారనే విషయం తెలియడంతో ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అయ్యింది.అయితే చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు చేసిన తరుణంలో టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.తాము ఎలాంటి కల్తీలు కలపలేదని దైవసాక్షిగా ప్రమాణం చేయటానికి సిద్ధమే చంద్రబాబు నాయుడు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

ఇలా ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తుంది.ఈ తరుణంలోనే ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు.ఈ క్రమంలోనే నటి ప్రణీత సుభాష్ (Pranitha Subhash) సైతం సోషల్ మీడియా వేదికగా ఈ లడ్డు కల్తీ విషయంపై స్పందించారు.

Advertisement

లడ్డు తయారీలో జంతువుల నూనె ఉపయోగించడం అనేది వెంకటేశ్వర స్వామి భక్తులు జీర్ణించుకోలేని విషయం అని తెలిపారు.ఎందుకు కారణమైన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఈమె తెలిపారు.

ఇలా ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు