మర్డర్ సినిమాపై కోర్టుకెక్కిన అమృత...

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాజంలో జరుగుతున్న యధార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని సినిమలను తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకి చెందిన మిర్యాల గూడ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కూతురు ఇతర సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని డబ్బు కోసం హత్యలు చేసే కిరాయి హంతకుల చేత దారుణంగా హత్య చేయించిన ఘటన ఆధారంగా ఇటీవలే "మర్డర్" అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించగా రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరించాడు.ఇప్పటికే ఈ చిత్ర చిత్రీకరణ పనులు పూర్తయ్యాయి.

కాగా ఇటువేయాలే ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ కూడా విడుదలైంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను కూడా సభ్యులు విడుదల చేశారు.

దీంతో ఈ విషయంపై మృతుడు ప్రణయ్ భార్య అమృత స్పందించింది. ఇందులో భాగంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇతరుల మానసిక వేదనను అర్థం చేసుకోకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

అంతేగాక తాను ఇప్పటికే భర్త, తండ్రి ని పోగొట్టుకుని తీవ్ర మానసిక క్షోభ తో బతుకుతున్నానని అలాంటి సమయంలో తమ అనుమతి లేకుండా తమపై సినిమాలు తెరకెక్కించడం సరికాదని అభ్యంతరాలు వ్యక్తం చేసింది.అంతేగాక ఈ ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ నల్గొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో కోర్టు  చిత్ర యూనిట్ సభ్యులకు విచారణకు హాజరు కావాలని అధికారికంగా నోటీసులు జారీ చేశారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మర్డర్ చిత్రంపై కేవలం అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, మారుతీ రావు కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క రామ్ గోపాల్ వర్మ కోర్టు పంపించిన విచారణ నోటీసులకు స్పందించి విచారణకు హాజరు అవుతాడా.? లేదా అన్న విషయంపై సోషల్ మీడియా మాధ్యమాలలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏదో ఒక వివాదంతో తన సినిమాని పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు