దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ విలన్-కమ్-క్యారెక్టర్-నటుడుగా ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్నటి వరకు బీజేపీపై విరుచుకుపడ్డ ప్రకాశ్ రాజ్.
ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ప్రత్యక్ష రాజకీయాలు గురించి మాట్లాడి చాలా కాలం అయ్యింది.
అయితే మళ్ళి ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలనే చూస్తున్నట్లు తెలుస్తుంది. సినిమాలతో పాటు రాజకీయాలు చేయాలని చూస్తున్నారని సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపించడం లేదు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి జరిగిన వివాదాస్పద ఎన్నికల తర్వాత హైదరాబాద్‌లో ఎక్కడా ఉండడంలేదు. అప్పుడప్పుడు కేసీఆర్‌తో భేటీ అవ్వడం మినహా డైరక్ట్ రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ కనిపించలేదు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌లను కలిసేందుకు కేసీఆర్‌తో కలిసి ముంబై వెళ్లారు.
ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి ఆయన తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించారు.
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఎక్కడా కనిపించలేదు.
అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పుడు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామితో సహా చాలా మంది నాయకులు హాజరైనప్పటికీ ప్రకాశ్ రాజ్ మాత్రం ఈ సమావేశానికి రాలేదు.

దీంతో కేసీఆర్.ప్రకాశ్ మద్య గ్యాప్ పెరిగిందని అందరూ భావించారు.ఎన్నికల సంఘం ఆమోదం మేరకు టీఆర్‌ఎస్‌ను అధికారికంగా బీఆర్‌ఎస్‌గా మార్చిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
ప్రకాష్ రాజ్ కేసీఆర్ వెంటే ఉంటూ, నవ్వుతూ నాయకులందరితో కరచాలనం చేస్తూ కనిపించారు. దీంతో రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్‌ఎస్‌లో కీలక పాత్ర పోషించడంలో ప్రకాశ్ రాజ్ పాత్ర కీలకంగా ఉండనుందని ఆర్ధమవుతుంది . ఆయనకు కర్ణాటక లేదా తమిళనాడులో బీఆర్ఎస్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.”ప్రకాష్‌కు కర్ణాటకలో BRS ఇన్‌ఛార్జ్‌గా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి, అది ఆయన రాష్ట్రానికి చెందినవాడు కావడంతో పాటు అక్కడ విస్తృత సంబంధాలు కలిగి ఉండడంతో కేసీఆర్ ఆయనకు అక్కడ కీలక బాధ్యతలు అప్పజేప్పనేన్నారు ” అని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు.