తిరుమల వివాదం గురించి ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు.. పవన్ కు సూటిగా ప్రశ్నలు వేస్తూ?

ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం( Tirumala Tirupati Shrine ) పేరు ప్రస్తుతం వివాదాల వల్ల మారుమ్రోగుతోంది.

వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ తయారీ విషయంలో కల్తీ జరిగిందని చంద్రబాబు( Chandrababu ) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు చేసిన ఆరోపణల గురించి సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో చర్చ జరుగుతోంది.పవన్ సైతం వైసీపీని నిందిస్తూ ఈ ఘటన గురించి కామెంట్లు చేశారు.

అయితే ప్రకాష్ రాజ్ ( Prakash Raj )మాత్రం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ డియర్ పవన్ కళ్యాణ్( Dear Pawan Kalyan ).మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జరిగిందని దయచేసి ఈ ఘటనపై విచారణ చేపట్టండని పేర్కొన్నారు.దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు.

అంతే తప్ప మీరు ఎందుకు ఆందోళనలను వ్యాపింపజేస్తూ సమస్య గురించి జాతీయంగా ఊదరగొడుతున్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.

Prakash Raj Sensational Comments About Tirumala Controversy Details Inside Goes
Advertisement
Prakash Raj Sensational Comments About Tirumala Controversy Details Inside Goes

దేశంలో ఇప్పటికే మనకు తగినన్ని మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.కేంద్రంలోని మీ ఫ్రెండ్స్ కు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడం జరిగింది.

Prakash Raj Sensational Comments About Tirumala Controversy Details Inside Goes

పవన్ ప్రకాష్ రాజ్ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.పవన్ కళ్యాణ్ సైతం త్వరలో వరుస షూటింగ్ లతో బిజీ కానున్న సంగతి తెలిసిందే.హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు