ప్రస్తుతం బుల్లితెరపై వివిధ భాషలలో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ముందుగా ఈ కార్యక్రమాన్ని సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతిఅనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు వచ్చారు.
ప్రస్తుతం ఈ కార్యక్రమం హిందీలో 13 సీజన్లలో పూర్తిచేసుకుని ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది.ఈ కార్యక్రమాన్ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నాలుగు సీజన్లను నిర్వహించారు.
అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులుగా జెమినీ టీవీలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమవుతుంది.
ఇక పోతే ఇలా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం మాదిరిగానే గతంలో ఒక ప్రవేట్ ఛానల్ లో ‘నీంగలుం వెల్లలామ్ ఒరికోడి‘ అనే పేరుతో ప్రసారమయ్యేది.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హోస్ట్ గా వ్యవహరించారు.ప్రకాష్ రాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సమయంలో ఈ కార్యక్రమానికి అతిథులుగా స్టార్ హీరో కమల్ హాసన్ హీరోయిన్ గౌతమి హాజరయ్యారు.
ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం మాదిరిగానే, నీంగలుం వెల్లలామ్ ఒరికోడి లోకూడా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే కోటి రూపాయలను సొంతం చేసుకోవచ్చు.

ఇలా ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి కమల్ హాసన్ గౌతమి ఎంతో చాకచక్యంగా ఈ ఆటను ఆడుతూ ప్రకాష్ రాజ్ అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.ఇలా హాట్ సీట్లో కూర్చున్నటువంటి కమల్ హాసన్, గౌతమి నీంగలుం వెల్లలామ్ ఒరికోడి’ కార్యక్రమంలో ఏకంగా 50 లక్షల రూపాయల డబ్బులను సొంతం చేసుకున్నారు.ఇలా వీరి గెలుచుకున్న 50 లక్షలను ప్రకాష్ రాజ్ వీరికి 50 లక్షలను చెక్కు రూపంలో అందించారు.
ఈ చెక్కును అందుకున్న కమల్ హాసన్ గౌతమి తిరిగి 50 లక్షల రూపాయల చెక్కును ప్రకాష్ రాజ్ కి అందిస్తూ ఆ మొత్తం డబ్బును క్యాన్సర్ బాధితుల సంక్షేమానికి కృషి చేస్తున్న పెట్రాల్‌దాన్ పిల్లయా స్వచ్ఛంద సమస్తకు విరాళంగా ప్రకటించారు.

ఇలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ గౌతమి అప్పట్లోనే 50 లక్షలు గెలుచుకోవడం గమనార్హం.ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో కూడా నాలుగు సీజన్లలో పూర్తిచేసుకొని ఐదవ సీజన్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే పేరుతో ప్రసారమవుతుంది.అయితే ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలు కాకుండా సాధారణ ప్రజలు కూడా రావడం గమనార్హం.
ఇకపై ఈ కార్యక్రమాన్ని మరింత ప్రేక్షకులకు దగ్గర చేయడం కోసం అప్పుడప్పుడు సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ కార్యక్రమం పై అంచనాలు పెంచుతున్నారు.ఇలా తెలుగులో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు అతిథులుగా వచ్చారు.
ఈ క్రమంలోనే వీరు గెలుచుకున్న డబ్బును కూడా పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలియజేశారు.