“చంద్రబాబు కే సవాల్” విసిరిన “టీడీపీ ఎమ్మెల్సీ”..   Prakasam District TDP MLC Fire On Chandrababu     2018-04-05   01:01:28  IST  Bhanu C

ఏపీలో రాజకీయాలు రోజు రోజు కి కొత్త మలుపులు తిరుగుతున్నాయి…ఈరోజు వైసీపి లో కూర్చుని మాట్లాడిన వాళ్ళు మరుసటి రోజు టిడిపి కండువా కప్పుకుని కనపడుతారు..టిడిపిలో కీలకంగా ఉన్న వాళ్ళు వైసీపి నేతలతో కలిసి తిరుగుతూ ఉంటారు..ఈ తరహా రాజకీయాలు ఎన్నికల ముందు సహజమే..నాలుగేళ్ళు గడిచేంతవరకూ పార్టీ అధినేతలని దేవుడిగా కొలిచే వాళ్ళే ఎన్నికలు దెగ్గర పడగానే అదే పార్టీ అధ్యక్షుడిని, అదే నోటితో దెయ్యం అంటారు సవాళ్లు విసురుతారు..ఇది ఎంతవరకూ సబబు ఇలాంటి నేతలని ప్రజలు ఎందుకు నమ్మాలి..సరే అసలు విషయానికి వస్తే..

కారణం బలరాం పేరు వినే ఉంటారు తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేత.ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తలపండిన వ్యక్తి ..ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేతల్లో ముందు వరుసలో ఉన్నారు..ఆయన చంద్రబాబు ని తెలుగుదేశం పార్టీ ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడే మాటలు ప్రకాశం తెలుగుదేశం కార్యకర్తలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి


ప్రకాశం జిల్లా టిడిపిలోకి గొట్టి పాటి రాకతో ప్రకాశం జిల్లా రాజయాల్లో తీవ్ర దుమారం చెలరేగుతుంది..ఈ విషయంలో ఎమ్మెల్సీ కరణం బలరాం నేరుగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా గొట్టిపాటి అద్దంకిలో రూల్ చేస్తుండటంతో.. పార్టీలో తనకు సరైన గుర్తింపు రావటం లేదని కరుణం బలరాం ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య జరుగుతున్న వార్ విషయంలో చంద్రబాబు అనేకసార్లు నేరు మందలించినా.. అక్కడ పరిస్థితులు తెలుగుదేశం పార్టీ కి పెద్ద చిక్కులు తెచ్చి పెట్టేవిగా మారాయి..చంద్రబాబు మాటలని కరణం బలరాం అస్సలు లెక్కచేయడం లేదు..గొట్టిపాటిపై తీవ్రమైన వ్యతిరేకతని ప్రదర్శిస్తున్న బలరాం ఈసారి ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు పై తీవ్రస్థాయిలో వ్యఖ్యలు చేశారు..

ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పెట్టుబడిదారులు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు మీరు పంపుతున్నారా లేక అసలేం జరుగుతోంది అక్కడ అంటూ చంద్రబాబు ని నిలదీశారు..ప్రకాశం జిల్లాని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేశారు..ఇదెక్కడి న్యాయం అని అడుగుతుంటే నోళ్ళు మూయిస్తున్నారు అంటూ మండిపడ్డారు బలరాం..అయితే గత కొంతకాలంగా బలరాం టిడిపి పార్టీ పై కావాలనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని..పార్టీ ఎంతో ఉన్నతమైన స్థానం కలిపిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకూ సమంజసం అని ప్రకాశం టిడిపి నేతలు బలరాం పై ఫైర్ అవుతున్నారు..అయితే బలరాం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక పార్టీ మార్పు ఆలోచన ఉందేమో అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి..