“జగన్” ఇచ్చిన షాక్ కి “పవన్ మైండ్” బ్లాక్..

ఎవరో పెద్దాయన చెప్పినట్లుగా ఆవేశ పడి ఒకే అరిచేస్తే ఆయాసం వస్తుంది తప్ప ఆలోచన రాదు అని.ఈ నిత్య సత్యం పవన్ కళ్యాణ్ విషయంలో ఎన్నో సార్లు రుజువయ్యింది.

 Ys Jagan Shocking Sketch On Pawan Kalyan-TeluguStop.com

పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సరే ఆవేశం తప్ప ఆలోచన ఉండదు అని పత్యేకించి చెప్పనవసరం లేదు ఈరోజు ఒక మాట చెప్తే అది మళ్ళీ ఊసులోకే రాదు అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇటువంటి స్వభావం ఉంటే పార్టీని నెట్టుకు రావడం ఎంతో కష్టం.అసలే ఏపీలో పవర్ పోలిటిక్స్ మొదలయ్యాయి.

నిన్నా మొన్నటి వరకూ రాసుకు పూసుకు తిరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ఇప్పుడు ఉప్పు నిప్పుగా మారిపోయారు.ప్రత్యక్ష రాజకీయాల్లోకి జనసేన ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ కి వెళ్ళకుండా పవన్ ఖాతాలో పడుతుంది.

అందుకే పవన్ కళ్యాణ్ ని జగన్ టార్గెట్ చేశారు.


పవన్ వేసే ప్రతీ అడుగు జగన్ తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు.ఈ క్రమంలోనే.ప్రత్యేక హోదాపై ఏప్రిల్ 6వ తేదీన పాదయాత్ర చేసి.

మే మొదటి వారంలో బెజవాడలో దీక్ష చేపట్టాలని నిర్ణయించాడు పవన్ కల్యాణ్…అయితే ఇదే విషయాన్ని గ్రహించిన జగన్.తన వ్యూహాన్ని మార్చుకున్నాడు.పవన్ కంటే ఒకడుగు ముందుకు వేశారు.ఏప్రిల్ 6వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయనున్నారు.

అదే రోజు పవన్ పాదయాత్ర.దీంతో అనుకున్నంతగా భారీ మైలేజ్ రావడం లేదు.

దాంతో ఎలా అయినా సరే వ్యూహాన్ని మార్చి మార్కులు తానూ కొట్టేయాలని అనుకున్న జగన్ వెంటనే మరొక ప్రకటన విడుదల చేశాడు.

రాజీనామాలు తరువాత తమ పార్టీ ఎంపీలు వెంటనే ఆమరణ దీక్ష చేపడతారని ప్రకటించాడు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పవన్ కి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది…జగన్ పార్టీ ఎంపీలు దీక్ష తర్వాత.తాను చేపడితే బాగుండదనే ఉద్దేశంతో మే మొదటి వారంలో చేపట్టబోయే దీక్ష షెడ్యూల్ ను పూర్తిగా మార్చేశాడు అని తెలుస్తోంది.

అయితే గతంలో కూడా అవిశ్వాసం తీర్మానం విషయంలోనూ జగన్ ని ఇలాగే ఇరుకున పెట్టి…పవన్ అడ్డంగా బుక్కయ్యాడు ఈ సారి జగన్ పవన్ కి భారీ షాక్ ఇచ్చి మరీ హోదా విషయంలో తనదే పై చేయని అనిపించుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి…అంతేకాదు ఇక నుంచీ టార్గెట్ బాబు విషయంలో ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తున్నాడో పవన్ పై కూడా అటువంటి వ్యుహాలని అమలు చేయనున్నాడని టాక్ మొత్తానికి బాబు వ్యతిరేక ఓటు పవన్ కి పడకుండా చాప కింద నీరులాగా జగన్ మెల్లగా పావులు కదుపుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube